Apples For Intimacy Health : యాపిల్స్‌తో ఆ సామర్థ్యం పెరుగుతుందట.. ఫస్ట్ నైట్ గదిలో పండ్లు పెట్టేది అందుకేనా?
Apples Might Enhance Your Physical Intimacy Life : యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే లైంగిక సామర్థ్యానికి కూడా యాపిల్ ఎన్నో మంచి ఫలితాలిస్తోంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ బెనిఫిట్స్ ఏంటంటే..
Intimacy Health Booster : రోజుకు ఒక యాపిల్ తింటే.. వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని.. ఆరోగ్యానికి అది అంత మంచిదని చెప్తారు. అయితే రోజూ యాపిల్ తినడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. లైంగిక సామర్థ్యం కూడా మెరుగవుతుందని చెప్తున్నారు. యాపిల్స్‌లోని న్యూట్రింట్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో లిబిడోను ప్రోత్సాహిస్తాయట. ఇవి పూర్తి లైంగిక ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. దీనివల్ల ఫిజకల్ రిలేషన్షిప్లో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
యాపిల్స్ వల్ల లైంగికంగా కలిగే లాభాలివే..
క్వెర్సెటిన్ : యాపిల్స్‌లో క్వెర్సెటిన్‌తో పాటు.. ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. ఇవి మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా.. శరీరంలో లిబిడోను పెంచుతాయి. ఇది లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది.
విటమిన్ సి : యాపిల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో లైంగికంగా ప్రేరేపించే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఫిజికల్ రిలేషన్‌కి హెల్ప్ చేస్తుంది.
ఫైబర్ : యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా హెల్తీ గట్‌ని ప్రమోట్ చేస్తుంది. ఈ రెండూ కూడా శరీరంలో లిబిడోను ఇంప్రూవ్ చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు : యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. మంటను దూరం చేస్తాయి. ఇవి రెండూ కూడా లిబిడో పెరుగుదనలు ప్రేరేపిస్తాయి.
ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. పెళ్లి తర్వాత జరిపే మొదటిరాత్రి తంతులో పండ్లకు అంత ప్రాధాన్యతనిస్తారా అని ప్రశ్న రాక మానదు. ముఖ్యంగా యాపిల్స్‌ను ఆ గదిలో ఉంచే సీన్స్ ఎన్నో సినిమాల్లో చూసే ఉంటారు.
మరిన్ని ప్రయోజనాలు..
బరువు తగ్గడంలో : యాపిల్స్‌లోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్స్ బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గుతూ ఉన్నప్పుడు లైంగక ఆరోగ్యం మెరుగవడంతో పాటు.. లిబిడో కూడా బాగా బూస్ట్ అవుతుంది.
గట్ హెల్త్ : యాపిల్స్‌లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది హెల్తీ గట్‌ని ప్రమోట్ చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మంటను తగ్గించి.. మానసికంగా కూడా హెల్తీగా ఉంచుతుంది. ఇది పరోక్షంగా లిబిడో పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
ఒత్తిడి : యాపిల్స్‌లోని న్యూట్రింట్స్, యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించి.. లిబిడో పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి.
మీరు లైంగిక ఆరోగ్యం కోసం యాపిల్ని డైట్లో చేర్చుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. యాపిల్స్‌ను రాత్రుళ్లు తినకపోవడమే మంచిది. అలాగే ఉదయాన్నే తింటే ఇంకా మంచిది. అలాగే లైంగిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి మేలుచేస్తుందని ఎక్కువ తినేయకూడదు. లిమిటెడ్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇదేకాకుండా యాపిల్స్తోనే వండర్స్ జరగాలంటే సాధ్యం కాదు. కానీ.. రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే కేవలం యాపిల్స్ తినడమే కాకుండా.. బ్యాలెన్స్డ్ డైట్, వ్యాయామం చేయడం చేస్తూ ఉంటే.. లైంగిక సామర్థ్యం కచ్చితంగా పెరుగుతుంది.
Also Read : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.