Viral: చూయింగ్ గమ్ నములుతూ నెలకు రూ. 67,000 సంపాదిస్తోన్న యువతి
సోషల్ మీడియా వచ్చాక సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అయిపోతున్నారు.
సోషల్ మీడియా రాకముందు పరిస్థితి ఒకలా ఉండేది, కానీ వచ్చాక సామాన్యులు సైతం సెలెబ్రిటీలుగా పేరు పొందుతున్నారు. తమ టాలెంట్‌తో అభిమానులతో పాటూ డబ్బునూ సంపాదించుకుంటున్నారు. తమకున్న విచిత్ర అలవాట్లను, టాలెంట్లను ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారు. అలా జర్మనీకి చెందిన ఓ యువతికి ఓ అరుదైన టాలెంట్ ఉంది. ఆమె చూయింగ్ గమ్ నములుతుంది. అదో పెద్ద టాలెంటా? ఎవరైనా నములుతారు కదా? అనుకోవచ్చు. ఆమె చూయింగ్ గమ్ నములుతూ నోటితో అతి పెద్ద బెలూన్లు ఊదుతుంది. ఎంత పెద్దవంటే ఆమె తలకన్నా అతి పెద్దవి. ఇందుకోసం ఆమె ముప్పై చూయింగ్ గమ్ లు నోట్లో వేసుకుని నములుతుంది.
నెలకు సంపాదన
ఆమె నెలకు 480 రూపాయలు పెట్టి చూయింగ్ గమ్‌లు కొంటుంది. వచ్చే ఆదాయం మాత్రం 67000 రూపాయలు. ఈ వ్యాపారమేదో బావుందని, ఇంట్లో కూర్చుని ఇదే పనిచేస్తోంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ...జూలియా. అన్నట్టు ఈమెకు ఇది అదనపు సంపాదన. ఈమె వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆమె టాలెంట్ ను చూసిన స్నేహితుడు సలహా మేరకు తన ఫోటోలను అమ్మడం ప్రారంభించింది. పెద్ద బుడగలు ఊదిన ఫోటోలను, వీడియోలను ప్రజలు ఇష్టపడుతుండడంతో వాటిని జర్మనీలోని కొన్ని ఆన్ లైన్ సైట్లలో పెట్టి అమ్మడం ప్రారంభించింది. కొంతమంది తమకు ఎలాంటి ఫోజుల్లో బుడగలు ఊదుతూ ఫోటోలు కావాలో కూడా అడుగుతారు. అలానే ఫోటోలు తీసి పంపిస్తుంది జూలియా. ఆమె వీడియోలు, ఫోటోలు జర్మనీలో వైరల్ గా మారాయి. ఎంతో మంది అభిమానులు కూడా తయారయ్యారు.
Unpredictabubble
— JBuxom (@buxomgirl) July 17, 2022
Video in https://t.co/TSqHe2PLAQ Sunday night#bigbubble #bubblegum #hugebubble pic.twitter.com/lh6icpK1my
సరదాగా తాను చేసే పని కూడా ఇలా డబ్బులు సంపాదించి పెడుతుందని ఎప్పుడూ అనుకోలేదని అంటోంది జూలియా. ఇరవై నుంచి ముప్పై చూయింగ్ గమ్‌లు నోట్లో వేసుకుంటే చాలు పెద్ద పెద్ద బుడగలు ఊదవచ్చు. ఈమెలా చేయాలని చాలా మంది అక్కడ ప్రయత్నించారు కానీ, పెద్ద బెలూన్లు ఊదడం మాత్రం వారి తరం కాలేదు. పెద్ద బెలూన్లు ఊదడానికి చిన్న కిటుకు ఉందని, అది తాను బయటికి చెప్పనని, స్నేహితుల్లో కొందరికి మాత్రమే తెలుసని చెప్పింది జూలియా.
Photosets and videos dropping this week - for my Fans here: https://t.co/TSqHe2PLAQ
— JBuxom (@buxomgirl) June 30, 2022
Thank You all SO MUCH for supporting my content❤️ You`re all amazing and the reason I work so hard to produce the best bubble content I can😘#bigbubble #doublebubble #MyClub pic.twitter.com/rcR6TdLKf6
Also read: గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? అండం విడుదలయ్యే రోజేదో ఇలా తెలుసుకుంటే, గర్భం ధరించడం సులువు
Also read: ఒత్తిడిగా, ఆందోళనగా అనిపిస్తోందా? ఇలా సహజంగా తగ్గించుకునేందుకు ప్రయత్నించండి