News
News
వీడియోలు ఆటలు
X

Cancer: యువతికి చిన్న మొటిమ వచ్చింది, తర్వాత ప్రాణాంతక క్యాన్సర్‌గా మారింది

క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచంలో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా ఉంది.

FOLLOW US: 
Share:

యువతలో మొటిమలు రావడం అనేది చాలా సాధారణ విషయం. ఇది హార్మోన్లకు సంబంధించినవి. కాలుష్యం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అయితే  మొటిమలను తేలికగా తీసుకోకూడదు. ఒక మహిళ ముక్కుపై చిన్న మొటిమ వచ్చింది. దానిని సాధారణ మొటిమ అనుకుని ఆమె పట్టించుకోలేదు. అది ఎర్రటి గడ్డగా మారింది. తర్వాత పుండుగా రూపాంతరం చెందింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆమె వైపు దగ్గరికి వెళ్ళింది. ఆ పుండు నుంచి రక్తస్రావం జరగడం మొదలైంది. వైద్యులకు అనుమానం వచ్చి పరీక్షలు చేయించారు. బయాప్సీ చేస్తే అది చర్మ క్యాన్సర్లలో ఒక రకమైన క్యాన్సర్ అని తేలింది. దాని పేరు బేసల్ సెల్ కార్సినోమా. ఆ క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. వైద్యులు అక్కడున్న పుండును తొలగించారు. ఒకసారి ఆమె చర్మ కేన్సర్ బారిన పడడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ఆ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెప్పారు.

ఏమిటీ క్యాన్సర్?
చర్మ క్యాన్సర్లలో ఒక రకమైనది బేసల్ సెల్ కార్సినోమా. శరీరంలో ఉండే కణాలు బేసల్ కణాలు. పాత కణాలు చనిపోవడంతో బేసల్ కణాలు కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తాయి. తీవ్రమైన సూర్య కిరణాలు కణాలను చేరకుండా చేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే అవి సమర్ధవంతంగా పనిచేయకుండా క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అక్కడ కొత్త కణాలు పుట్టవు. పాతవి పుండుగా మారి పేరుకుపోతాయి. దీనికి సకాలంలో రోగనిర్ధారణ జరగడం అవసరం. కొన్ని రకాల ప్రారంభ లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 

లక్షణాలు ఇలా
పుండ్లు, ఎర్రటి పాచెస్, మెరిసే గడ్డలు, మచ్చల్లాంటివి కనిపిస్తాయి. చిన్న కురుపులు ఎత్తుగా ఎదుగుతాయి. పొట్టులా రాలుతుంది. దురద, రక్తస్రావం వంటివి జరుగుతాయి. సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలోనే ఇవి వస్తాయి. 

చికిత్స ఉందా?
బేసల్ సెల్ క్యాన్సర్ ముందుగానే కనిపెట్టి చికిత్స అందిస్తే ఇది నయమయ్యే అవకాశం ఉంది. చర్మ క్యాన్సర్లలో 80శాతం మందికి ఇది సోకే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ కు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే అది ప్రాణాంతకంగా మారే ఛాన్సులు ఉన్నాయి. 

వేసవిలో మండే ఎండల్లో సూర్య కాంతి చర్మం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే సూర్య కిరణాలలో ఉండే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని తాకి చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

Also read: మీరు తినే ఈ తెల్లని పదార్థం మిమ్మల్ని తన బానిసగా చేసుకుంటుంది, ఎంత తగ్గిస్తే అంత మంచిది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 09 May 2023 10:02 AM (IST) Tags: Warts Skin Cancer Acne Pimple Acne turned Cancer

సంబంధిత కథనాలు

Chinese Woman: షాపింగ్‌ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై

Chinese Woman: షాపింగ్‌ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు