అన్వేషించండి

Embracing Self Love and Inner Peace : అందరికంటే ముందు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో తెలుసా? ఇలా చెప్పేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో

Positivity and Self Love : ఎవరు మనల్ని ప్రేమించినా.. ప్రేమించకపోయినా.. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. సెల్ఫ్​ లవ్​ అనేది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. 

Self Care Activities for Body : మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే.. వెంటనే థ్యాంక్స్ అని చెప్తాము. అలాంటి మీ శరీరం మీకు ఎన్ని రకాలుగా సహాయం చేస్తుందో తెలుసా? వాటికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? ఇతరులకు థ్యాంక్స్ చెప్పినంత తేలికగా.. మీకు మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా? రోజు ప్రారంభంలో మీరు దేనికైనా థ్యాంక్స్ చెప్పాల్సి ఉందంటే.. అది మీ శరీరానికి మాత్రమే. కొన్ని విషయాల్లో సెల్ఫ్​లెస్​గా ఉండాలి కానీ.. మీ శరీరం విషయంలో మీరు కచ్చితంగా థ్యాంక్​ఫుల్​గా ఉండాలి. రోజుకో అంచనాలను మనపై రుద్దే ఈ సమాజం కోసం కాకుండా.. మీ ఆరోగ్యం, మీ మానసిక సంతృప్తికి తగ్గట్లు దానిని మార్చుకుని.. శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోండి. అయితే ఈ థ్యాంక్స్​ని మీ శరీరానికి ఎలా చెప్పుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

మెడిటేషన్

ధ్యానం అనేది మీ మనసును కేంద్రీకరించుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం. మీ లైఫ్​ ఒత్తిడిలో ఉన్నప్పుడు.. లేదా మీ మనసు పనిపై దృష్టి పెట్టలేని సమయంలో మీరు ధ్యానం చేయవచ్చు. దీనిని మీరు ఎక్కడైనా చేయవచ్చు కాబట్టి.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రశాంతంగా, సౌకర్యవంతమైన స్థలంలో కూర్చోండి. ఇది మీకు విశ్రాంతిని ఇస్తుంది. మనసును తేలిక పరిచి.. మిమ్మల్ని రీబూస్ట్ చేస్తుంది. మీరు సొంతంగా మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వగలుగుతారు. 

వ్యాయామం..

మీ శరీరం మీ మాట వినాలంటే.. మీరు దానికి కావాల్సింది ఇవ్వాలి. దానిని యాక్టివ్​గా ఉంచుతూ.. చురుకుగా కదిలిస్తూ ఉంటే.. అది మిమ్మల్ని యాక్టివ్​గా ఉంచుంతుంది. పనిలో యాక్టివ్​గా.. నిద్ర సమయంలో చక్కటి విశ్రాంతిని అందిస్తుంది. వ్యాయామం అంటే జిమ్​కి వెళ్లాలని కాదు.. ఇంట్లో పనులు చేయడం.. వాకింగ్​కి వెళ్లడం.. కూరగాయలు వంటివి నడిచి వెళ్లి తెచ్చుకోవడం వంటి వాటి వల్ల మీరు చురుకుగా ఉంటారు. అప్పుడు మీ శరీరాన్ని మీరు అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. 

నచ్చిన పని చేయడం

కొందరికి పుస్తకాలు చదవడం ఇష్టముంటుంది. పెయింటింగ్ వేయడం నచ్చుతుంది. డ్యాన్స్ చేస్తే మజాగా ఉంటుంది. మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మీ శరీరం చాలా యాక్టివ్​గా ఉంటుంది. కానీ వివిధ కారణాల వల్ల టైమ్ సరిపోవట్లేదంటూ.. శరీరానికి ఇష్టమైన వాటిని దూరం చేస్తూ ఉంటాము. మీకు తెలుసా మీకు నచ్చినపని చేయడం వల్ల మీ మైండ్, శరీరం యాక్టివ్​గా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన పని చేసిన తర్వాత మీరు ఇతర పనులను కూడా అంతే చురుకుగా చేయగలుగుతారు. 

ఆ పనుల్లో ఆలస్యమే అమృతం.. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పనిని వేగంగానే చేయాల్సి వస్తుంది. అలాంటి వాటిలోకి తెలియకుండానే శరీరానికి ఇష్టమైన వాటిని కూడా దూరం చేసేస్తున్నారు. నచ్చిన ఫుడ్​ని కూడా ఆస్వాదిస్తూ తినలేని రోజులు ఎన్ని ఉంటున్నాయోనని ఎప్పుడైనా ఆలోచించారు. మీకో విషయం తెలుసా? నచ్చిన ఫుడ్​ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తింటే.. మీరు ఎంత తింటున్నారు అనేది బాగా తెలుస్తుంది. లేదంటే ముందు ఉన్నదానిని ఫినిష్ చేసి.. ఆ తర్వాత ఆపసోపాలు పడతారు. బయటకు వెళ్లినప్పుడు నచ్చిన వ్యూని ఎంజాయ్ చేయడం మానేసి.. ఫోన్​లలో మునిగిపోవడం వాటివి చేస్తారు. ఇలాంటి విషయాల్లో మీరు ఫాస్ట్​గా ఉండడం కంటే నెమ్మదిగా ఉంటేనే మీ శరీరానికి ఇష్టమని గుర్తించండి. వర్క్​లో బిజీగా ఉన్నప్పుడు బ్రేక్​ తీసుకుని ఫోన్​లో మునిగిపోకుండా.. ఓ పదినిమిషాలు డీప్​ బ్రీత్​ తీసుకోండి. ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. 

అద్దంలో చూసుకుని..

రోజూలో ఓసారి అయినా మీరు అద్దం చూసుకుంటారు కదా. ఆ సమయంలో పనిలో పడి రెడీ అవ్వడం కాకుండా.. ఓసారి మిమ్మల్ని చూసి మీరు హాయిగా నవ్వుకోండి. నువ్వు నవ్వితే బాగుంటావు అని మీకు మీరు కాంప్లిమెంట్ ఇచ్చుంకోండి. ఇది మీలో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీకు మీరు ఐ లవ్​ యూ చెప్పుకోండి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. మీకు రోజూ ఐ లవ్​ యూ చెప్పుకుంటే.. మీ మనసు హాయిగా ఉంటుంది. 

ఉదయం, రాత్రి.. పడుకునే ముందు లేచిన తర్వాత.. ఈరోజు నువ్వ చాలా కష్టపడ్డావు. చాలా విషయాల్లో నాకు సహకరించావు.. నువ్వు చేసిన దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను అని మీ శరీరానికి చెప్పండి. ఉదయం లేచిన వెంటనే.. మరొక రోజు మిమ్మల్ని చూసేందుకు అనుమతించినందుకు థ్యాంక్స్ చెప్పండి. ఈ చిన్న చిన్న విషయాలు మీలో ఎంత మార్పును తీసుకువస్తాయో చూస్తే మీరే షాకవుతారు. 

Also Read : పారాసెటమాల్ వాడుతున్నారా? ఇది తెలిస్తే మీ ‘గుండె’ ఆగుద్ది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget