By: ABP Desam Spot Light | Updated at : 27 Sep 2023 01:29 PM (IST)
Edited By: omeprakash
నిట్ వరంగల్ గ్రూప్-డి పోస్టులు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో ఇటీవల భర్తీ చేసిన 23 గ్రూప్-డి నియామకాలను రద్దు చేశారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఇవ్వలేదని, కనీసం పత్రిక ప్రకటనలు కూడా ఇవ్వకుండా భర్తీ చేయడం చెల్లదని 62వ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు.
నిట్‌లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి 2021లో నోటిఫికేషన్ లేకుండానే నియామక పరీక్ష జరిగింది. ఎంపికైన వారికి 'పీఎం రోజ్‌గార్ మేళా' మిషన్ మోడ్‌లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా ఇటీవల నియామక ఉత్తర్వులు ఇప్పించారు. వీరికి సెప్టెంబరు 26న నియామక రద్దు పత్రాలను అందజేశారు.
ఈ 23 గ్రూప్-డి పోస్టుల తరహాలోనే గతంలో 9 ఖాళీలను నిట్ యాజమాన్యం భర్తీచేసింది. అవన్నీ కూడా గ్రూప్-4 కేడర్ పోస్టులే. అయితే వాటిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. గతంలోనూ ఇక్కడ పలు పోస్టుల భర్తీలో పారదర్శకత లోపించిందని పలువురు కేంద్రానికి ఫిర్యాదులు అందాయి.
ALSO READ:
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023(సీహెచ్‌ఎస్‌ఎల్)కు పోస్టుల సంఖ్య పెంచినట్లు సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 162 పోస్టులను చేర్చింది. దీంతో గతంలో ఖాళీల సంఖ్య 1,600 ఉండగా.. తాజాగా మొత్తం ఖాళీల సంఖ్య 1,762 కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (2) - 2023) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అదేవిధంగా తర్వాతి దశలో ఇంటర్వ్యూలు పూర్తయిన 30 రోజుల్లోగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ- సీఏపీఎఫ్ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెప్టెంబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను యూపీఎస్సీ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ తదితర దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి "సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2023" నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' సిలబస్లో కీలక మార్పులు, అవేంటంటే?
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
/body>