అన్వేషించండి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023(సీహెచ్‌ఎస్‌ఎల్‌)కు పోస్టుల సంఖ్య పెంచినట్లు సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో వెల్లడించింది.

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023(సీహెచ్‌ఎస్‌ఎల్‌)కు పోస్టుల సంఖ్య పెంచినట్లు సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 162 పోస్టులను చేర్చింది. దీంతో గతంలో ఖాళీల సంఖ్య 1,600 ఉండగా.. తాజాగా మొత్తం ఖాళీల సంఖ్య 1,762 కి చేరింది. 

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి మే నెలలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఆగస్టులో టైర్‌-1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

టైర్-2 పరీక్ష విధానం..
CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

ALSO READ:

యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (2) - 2023) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అదేవిధంగా తర్వాతి దశలో ఇంటర్వ్యూలు పూర్తయిన 30 రోజుల్లోగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget