అన్వేషించండి

IFS Admitcard: ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు 17 నుంచి అందుబాటులోకి, పరీక్ష వివరాాలు ఇలా

IFS Exam Admit Card: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్-2023 పరీక్ష నిర్వహణకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా నవంబరు 17న అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది.

UPSC IFS (Main) Exam 2023 Admit Card: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్-2023 పరీక్ష నిర్వహణకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా నవంబరు 17న పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను (IFS Main Exam 2023 Hall Tickets) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది లేనిదే పరీక్ష రాయడానికి అనుమతించరు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.  మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే ఈమెయిల్: soexam9-upsc@gov.in ద్వారా సంప్రదించవచ్చు.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 26 నుంచి 30 వరకు, అదేవిధంగా డిసెంబరు 1 - 3 వరకు ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబరు 26న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు కాబట్టి, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలి. 

ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్షల షెడ్యూలు ఇలా.. (IFS Main Exam 2023 Schedule)

➥ నవంబర్ 26న ఉదయం సెషన్‌లో జనరల్ ఇంగ్లిష్, మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ నాలెడ్జ్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ నవంబర్ 28న ఉదయం సెషన్‌లో మ్యాథమెటిక్స్ పేపర్-1/స్టాటిస్టిక్స్ పేపర్-1/ జువాలజీ పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో మ్యాథమెటిక్స్ పేపర్-2/స్టాటిస్టిక్స్ పేపర్-2/జువాలజీ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

➥ నవంబర్ 29న ఉదయం సెషన్‌లో ఫిజిక్స్ పేపర్-1/బోటనీ పేపర్-1 పరీక్ష, మధ్నాహ్నం సెషన్‌లో ఫిజిక్స్ పేపర్-2/ బోటనీ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

➥ నవంబర్ 30న ఉదయం సెషన్‌లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పేపర్-2/ జియాలజీ పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పేపర్-2/ జియాలజీ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.

➥ డిసెంబర్ 1న ఉదయం సెషన్‌లో అగ్రికల్చర్ పేపర్-1/ యానిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్ పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఇక మధ్యాహ్నం సెషన్‌లో అగ్రికల్చర్ పేపర్-2/ యానిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.

➥ డిసెంబర్ 2న ఉదయం సెషన్‌లో ఫారెస్ట్రీ పేపర్-1 మాత్రమే నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం సెషన్‌లో ఫారెస్ట్రీ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

➥ డిసెంబర్ 3న ఉదయం సెషన్‌లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్-1/ కెమికల్ ఇంజనీరింగ్ పేపర్-1/ మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్-1/ కెమిస్ట్రీ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం సెషన్‌లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్-2/కెమికల్ ఇంజనీరింగ్ పేపర్-2/ మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్-2, కెమిస్ట్రీ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.

మెయిన్ పరీక్ష విధానం:

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు మొత్తంగా ఆరు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్షనల్స్‌ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అనుమతించరు.

పేపరు సబ్జెక్టు మార్కులు
పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 300
పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 300
పేపర్-3 ఆప్షనల్ సబ్జెక్ట్(1)- పేపర్-1 200
పేపర్-4 ఆప్షనల్ సబ్జెక్ట్(1)- పేపర్-2 200
పేపర్-5 ఆప్షనల్ సబ్జెక్ట్(2)- పేపర్-3 200
పేపర్-6 ఆప్షనల్ సబ్జెక్ట్(2)- పేపర్-4 200

 

 

 

 

 

 

 

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లు..
అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ.

IFS Admitcard: ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు 17 నుంచి అందుబాటులోకి, పరీక్ష వివరాాలు ఇలా

IFS Admitcard: ఐఎఫ్‌ఎస్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు 17 నుంచి అందుబాటులోకి, పరీక్ష వివరాాలు ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget