News
News
వీడియోలు ఆటలు
X

UPSC CDS Result: యూపీఎస్సీ సీడీఎస్‌-(1) 2023 పరీక్ష ఫలితాలు విడుదల! రిజల్ట్ లింక్ ఇదే!

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(సీడీఎస్-1) 2023 రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(సీడీఎస్-1) 2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. సీడీఎస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. యూపీఎస్సీ సీడీఎస్-1 పరీక్షను ఏప్రిల్ 16న నిర్వహించింది. పరీక్షకు హాజరైనవారిలో 6,518 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. 

UPSC CDS 1 Result 2023: ఫలితాలు ఇలా చూసుకోండి...

1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in

2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.

3) ఇప్పుడు “Written Result (with name): Combined Defence Services Examination (I), 2023” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి. 

5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 

6) ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

సీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

అభ్యర్థుల పేర్లతో సీడీఎస్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 341 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి 2022 డిసెంబరు 21 నుంచి 2023 జనవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాత ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. 

పోస్టుల వివ‌రాలు...

* కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్‌) ఎగ్జామినేష‌న్ (I)-2023

ఖాళీల సంఖ్య: 341

అకాడమీల వారీగా ఖాళీలు..

➥ ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100

➥ ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 22

➥ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై: 170

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై: 17

యూపీఎస్సీ సీడీఎస్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 May 2023 07:10 PM (IST) Tags: UPSC CDS Results CDS Results UPSC CDS 1 2023 Results UPSC CDS 2023 Results

సంబంధిత కథనాలు

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో 30 సివిల్ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

DRDO Recruitment: హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

ITBP Head Constable Posts: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్