UPSC CDS Exam: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 పరీక్ష ఈఅడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సీడీఎస్‌ఈ-2023 రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) ఆగస్టు 10న విడుదల చేసింది.
త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ)-2023 రాత పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) ఆగస్టు 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. సీడీఎస్‌ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రూల్ నెంబర్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 3న సీడీఎస్ఈ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
సీడీఎస్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 349 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెల్లిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు, మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. వీరికి 200 మార్కులకే రాతపరీక్ష ఉంటుంది.
ఇంటర్వ్యూ విధానం: ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2023.
➥ నేరుగా ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.06.2023.
➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2023. (6:00 PM)
➥ దరఖాస్తుల ఉపసంహరణ: 07.06.2023 - 13.06.2023.
➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 03.09.2023.
➥ ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: 2023, సెప్టెంబర్-అక్టోబరులో.
➥ కోర్సులు ప్రారంభం: 02.01.2024.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..