టీఎస్‌పీఎస్సీ పదవులకు వందకుపైగా దరఖాస్తులు, చైర్మన్‌గా ఐపీఎస్ ఉన్నతాధికారి?
TSPSC News: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తు గడువు జనవరి 18తో ముగిసింది. ఇందుకోసం జనవరి 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు వందకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు.
![టీఎస్‌పీఎస్సీ పదవులకు వందకుపైగా దరఖాస్తులు, చైర్మన్‌గా ఐపీఎస్ ఉన్నతాధికారి? TSPSC News more than 100 applications for tspsc chairman and members posts టీఎస్‌పీఎస్సీ పదవులకు వందకుపైగా దరఖాస్తులు, చైర్మన్‌గా ఐపీఎస్ ఉన్నతాధికారి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/4d92661f1f46bc0cf4f1275ca698e41c1685452217621233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TSPSC Chairman Members Recruitment: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తు గడువు జనవరి 18తో ముగిసింది. ఇందుకోసం జనవరి 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. దాదాపు వందకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఛైర్మన్, సభ్యులకు వేతనం దాదాపు రూ.2 లక్షల వరకు ఉండటంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు పోటీపడ్డారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. వీటిని సెర్చ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.
చైర్మన్‌గా ఐపీఎస్?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా పోలీసు ఉన్నతాధికారిని నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ప్రస్తుతం సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక ఐపీఎస్ అధికారితోపాటు రాష్ర్టానికి విశేష సేవలందించిన రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆ అధికారి చైర్మన్ పదవికి సుముఖంగా లేరని తెలిసింది. చైర్మన్ పోస్టుకు మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు సుముఖంగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి ప్రకారం ఆయన ఒక ఏడాది మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. కమిటీ సూచించిన పేర్లను ప్రభుత్వం పరిశీలించి నియామకం కోసం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపుతుంది. గవర్నర్ నిర్ణయం మేరకు కమిషన్‌కు కొత్త ఛైర్మన్, సభ్యులు ఎంపికవుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం ఛైర్మన్, సభ్యులను గవర్నర్ నియమించనున్నారు.
ఈ పదవులకు దరఖాస్తు చేసేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న పలువురు అర్హతలు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. కమిటీ సూచించిన పేర్లను ప్రభుత్వం పరిశీలించి నియామకం కోసం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపుతుంది. గవర్నర్ నిర్ణయం మేరకు కమిషన్‌కు కొత్త ఛైర్మన్, సభ్యులు ఎంపికవుతారు.
వివరాలు...
* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియమాకాలు
1) ఛైర్మన్
2) కమిషన్ సభ్యులు
అర్హతలు..
➥ టీఎస్‌పీఎస్సీ నిబంధన 3 ప్రకారం.. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండటానికి వీల్లేదు.
➥ కమిషన్‌లో సగంమంది సభ్యులు కేంద్ర, రాష్ట్రాల సర్వీసుల్లో పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారై ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండకూడదు. మిగతా సభ్యులు అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి.
➥ కేంద్ర, రాష్ట్ర పీఎస్సీల సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు కాగా.. ఆలోపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సభ్యుడి వయసు 65 సంవత్సరాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటివారు.. మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)