అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు.

TSPSC Chairman, Members Recruitment: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల నియామకానికి జనవరి 12న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. సరైన అర్హతలున్నవారు జనవరి 18న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి, కమిషన్‌కు పేర్లను ప్రతిపాదిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం ఛైర్మన్, సభ్యులను గవర్నర్ నియమించనున్నారు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in ద్వారా పంపాల్సి ఉంటుంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వివరాలు...

* టీఎస్‌పీఎస్సీ నియమాకాలు

1) ఛైర్మన్

2) కమిషన్ సభ్యులు

అర్హతలు..

➥  టీఎస్‌పీఎస్సీ నిబంధన 3 ప్రకారం.. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండటానికి వీల్లేదు. 

➥  కమిషన్‌లో సగంమంది సభ్యులు కేంద్ర, రాష్ట్రాల సర్వీసుల్లో పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారై ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండకూడదు. మిగతా సభ్యులు అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. 

➥ కేంద్ర, రాష్ట్ర పీఎస్సీల సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు కాగా.. ఆలోపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సభ్యుడి వయసు 65 సంవత్సరాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TSPSC)లో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటివారు.. మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్ చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం: ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు వివరాలు ఇలా..

➥ దరఖాస్తులో అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలతోపాటు.. వృత్తి, ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఉంటే.. ఎంతకాలం పనిచేశారు, పదవీ విరమణ ఎప్పుడు చేశారన్న వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

➥ విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు పాసైన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి.

➥ అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏయే హోదాల్లో పనిచేశారో చెప్పాలి.

➥ ప్రముఖుల కేటగిరీలో అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో వారి సేవలను చెప్పాలి. గతంలో సాధించిన 5 విజయాల గురించి 200 పదాలకు మించకుండా రాసి, ఆ వివరాలు అప్‌లోడ్ చేయాలి. ప్రొఫెషనల్ రంగాలు, విద్యాసంస్థలు, సొసైటీలు లేదా రాజకీయ పార్టీలు, సంఘాలతో అనుబంధం వివరాలను తెలపాలి.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2024.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18.01.2024. (5 PM)

Notification

Application

Website

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget