TSPSC Group 1 Final Key: 'గ్రూప్–1' ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదల!! 8 ప్రశ్నల్లో తేడాలు - 5 ప్రశ్నలు డెలీట్, మరి మిగతా 3 ప్రశ్నలు?
నవంబరు 14న నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక 'కీ' అభ్యంతరాలపై చర్చించింది. అనంతరం నవంబరు 15న ఫైనల్ కీని విడుదల చేశారు.
గ్రూప్ – 1 ప్రిలిమినరీ ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న రాత్రి విడుదల చేసింది. నవంబరు 14న నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక 'కీ' అభ్యంతరాలపై చర్చించింది. అనంతరం నవంబరు 15న ఫైనల్ కీని విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీని అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ -1 రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబరు 29న ప్రాథమిక కీని విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేశారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రాథమిక కీలో అభ్యంతరాల స్వీకరణ తర్వాత మొత్తం 8 ప్రశ్నల్లో తేడాలు ఉన్నట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. వీటిలో 5 ప్రశ్నలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిగించింది. రెండు ప్రశ్నకు 1 కంటే ఎక్కువ సమాధానాలు ఇచ్చారు. ప్రకటించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఫైనల్ 'కీ' ప్రకారం.. 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించారు. 107, 133 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలను ఇచ్చారు. ఇక 57వ ప్రశ్నకు సమాధానాన్ని మార్చారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ లో వీటి వివరాలను స్పష్టంగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అక్టోబరు 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో వివిధ సిరీస్‌లలో ప్రశ్నలతో పాటు సమాధానాలను కూడా జంబ్లింగ్ చేసి బహుళ సిరీస్‌ల్లో ప్రశ్నపత్రాలను రూపొందించారు. వాటన్నింటికీ మాస్టర్‌గా ఉన్న ప్రశ్నపత్రాన్ని, దాని ప్రాథమిక ఆన్సర్ కీని అధికారులు విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు 5 రోజులపాటు అవకాశం కల్పించారు.
ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (OMR డిజిటల్ కాపీలను) కూడా అధికారిక టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డిజిటల్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29 వరకు అభ్యర్థుల OMR పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. గడువు అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు పొందే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 16న 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో టీఎస్‌పీఎస్సీ తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు. ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
:: ఇవీ చదవండి ::
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ !
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..