TSPSC FSO Recruitment: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ !
ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు.
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
కీపై అభ్యంతరాలకు అవకాశం..
ఈ ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలుంటే నవంబర్ 16 నుంచి తెలపవచ్చు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక లింకును ఏర్పాటు చేయనుంది. ఈ లింక్ ద్వారా మీరు అభ్యంతరం చేయవలసిన ప్రశ్నలకు తగిన ఆధారాలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 20 వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే అబ్జెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. అభ్యంతరాలను మెయిల్స్ ద్వారా గానీ.. ఫోన్ ద్వారా గానీ వ్యక్తం చేయకూడదని తెలిపారు.
ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్ల కోసం
తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 21న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అక్టోబరు 31న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్మాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది.
పరీక్షకు 64 శాతం హాజరు..
రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాల్లోని 56 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 16,381 మంది దరఖాస్తు చేసుకోగా.. 14,830 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో కేవలం 9,535 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 47 మంది అభ్యర్థులు పేపర్-1 మాత్రమే రాశారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.
అర్హత మార్కులివే..
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత మార్కులను ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా (120 మార్కులు), బీసీలకు 35 శాతంగా (105 మార్కులు), ఎస్సీ-ఎస్టీలు, దివ్యాంగులకు 30 (90 మార్కులు) శాతంగా నిర్ణయించారు.
:: Also Read ::
DRDO: డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబ్‌లో అప్రెంటిస్ ఖాళీలు - ఐటీఐ, డిప్లొమా ఉండాలి!
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా మొత్తం 101 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా(ఏఎన్‌ఎం) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డీఆర్‌డీఎల్ పనిచేస్తుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. ఆయా పోస్టులకు నవంబరు 20 తర్వాత వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు, అటవీశాఖ ఉద్యోగాలు, గురుకుల టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..