అన్వేషించండి

TGPSC Group l Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే

Group-l Mains Examination Dates: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును టీజీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Telangana Group-l (Mains) Examination Schedule: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబరు 27తో పరీక్షలు ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1లో మొత్తం 563 పోస్టులుండగా, ఒక్కో పోస్టుకు 536 మంది చొప్పున పోటీపడుతున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్‌కు ఎంపికచేయనున్నారు.   

గ్రూప్-1 మెయిన్స్ 2024 పరీక్షల షెడ్యూలు..

➥ 21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) 

➥ 22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)

➥ 23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)

➥ 24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)

➥ 25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)

➥ 26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్) 

➥ 27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)

TGPSC Group l Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే

TGPSC Group l Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే

పరీక్ష విధానం: మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్ష మాత్రమే పరిగణిస్తారు. ఇక మిగతా ఆరు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. 

TGPSC Group l Mains: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే
మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 563

1. డిప్యూటీ కలెక్టర్: 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP): 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్: 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్: 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్: 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్: 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్): 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్: 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్: 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/ డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/ అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్): 05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-2: 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్): 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 140

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి  14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 3.02 లక్షల మంది మాత్రమే (74 శాతం) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీని కమిషన్ విడుదల చేయనుంది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget