TSPSC: ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల, ఇక్కడ చూసుకోండి!
జనవరి 8న నిర్వహించిన రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 22న విడుదల చేసింది. పేపర్-1, పేపర్-2 ఆన్సర్ కీ లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఉమెన్ డెవలప్‌మెంట్ & ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 22న విడుదల చేసింది. పేపర్-1, పేపర్-2 ఆన్సర్ కీ లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి 20న ప్రిలిమనరీ కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీని తాజాగా విడుదల చేసింది. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ విడుదల కావడంతో.. ఇక త్వరలోనే ఫలితాలను విడుదల చేయడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్ష హాల్‌టికెట్లను జనవరి 2న విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జనవరి 8న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జనవరి 20న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 24 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫిబ్రవరి 22న ఫైనల్ కీని విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.
Also Read:
DAO HallTickets: డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
జూనియర్ ఇంజినీర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీజియన్లవారీగా అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్లు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..