News
News
X

TSPSC: అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ నోటిఫికేషన్ రద్దు, కారణమిదే!

ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అడగకుండా.. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగటం ఏంటని.. అది కూడా మహిళలు ఈ లైసెన్స్ తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అభ్యంతరాలు రావడంతో నోటిఫికేషన్ రద్దయింది.

FOLLOW US: 

తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వాటిని రవాణా శాఖకు తెలియజేసినట్లు కమిషన్ వెల్లడించింది. 

కారణం ఇదే..
ఈ నోటిఫికేషన్ అర్హతల గురించి మహిళా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో పాటు.. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే  ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అడగకుండా.. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగటం ఏంటని.. అది కూడా మహిళలు ఈ లైసెన్స్ తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అభ్యంతరాలు రావడంతో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయింది.
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జూలై 27  నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. వీటిలో మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుండగా.. తాజాగా నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పబ్లిక్ కమిషన్ వెల్లడించింది.
మల్టీజోన్- I జిల్లాలు: కుమరంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూరల్).

మల్టీజోన్- II జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్.

Also Read:

SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంట్రాక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Sep 2022 01:09 AM (IST) Tags: TSPSC Recruitment TSPSC AMVI Notification AMVI Notification Cancelled

సంబంధిత కథనాలు

IBPS RRB PO Hall Ticket: వెబ్‌సైట్‌లో ఐబీపీఎస్ పీవో అడ్మిట్ కార్డులు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

IBPS RRB PO Hall Ticket: వెబ్‌సైట్‌లో ఐబీపీఎస్ పీవో అడ్మిట్ కార్డులు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Andhra Pradesh News: 62 ఏళ్లకు రిటైర్మెంట్ పెంపు వారికి వర్తించదు - ఏపీ ఆర్థికశాఖ క్లారిటీ

Andhra Pradesh News: 62 ఏళ్లకు రిటైర్మెంట్ పెంపు వారికి వర్తించదు - ఏపీ ఆర్థికశాఖ క్లారిటీ

NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

SSC Stenographer: స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి! డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

SSC Stenographer: స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి! డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

UPSC CDS Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (II) - 2022 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

UPSC CDS Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (II) - 2022 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల