By: ABP Desam | Updated at : 24 Feb 2023 07:18 AM (IST)
Edited By: omeprakash
గ్రూప్-3 దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణలో గ్రూప్-3 దరఖాస్తు గడువు గురువారం(ఫిబ్రవరి 23న)తో ముగిసింది. రాష్ట్రంలో 1,375 గ్రూప్-3 పోస్టులకుగాను దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ నెలకొంది. గ్రూప్-3 పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. చివరి మూడు రోజుల్లో 90,147 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇక చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు రావడం విశేషం. అయితే అభ్యర్థుల ఫీజు చెల్లింపుల వివరాలు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది.
గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట 1363 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తర్వాత మరో 12 పోస్టులను జతచేశారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా.. తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది.
త్వరలోనే గ్రూప్-2, 3 పరీక్ష తేదీల ఖరారు..
గ్రూప్-2, 3 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు గడువు ముగియడంతో త్వరలో పరీక్ష తేదీలు ఖరారు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. గ్రూప్-2, 3 పరీక్షల తేదీలపై సమావేశమై ఒకేసారి వివరాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఖరారైన పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలిస్తోంది. పరీక్ష తేదీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ వర్గాలు తెలిపాయి.
గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
* గ్రూప్-3 పోస్టులు
పోస్టుల సంఖ్య: 1375
1) జూనియర్ అసిస్టెంట్: 667 పోస్టులు
2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు
3) ఆడిటర్: 126 పోస్టులు
4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు
5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు
6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు
7) అకౌంటెంట్: 01 పోస్టు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
'గ్రూప్-2' ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ!
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
12,523 ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12,523 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్‌టెక్నికల్), హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 17తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
BMRCL: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో 68 ఇంజినీర్ ఉద్యోగాలు, అర్హతలివే!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
AP High Court Results: జిల్లా కోర్టు రాతపరీక్షల ఫలితాలు విడుదల, మెరిట్ జాబితా & కటాఫ్ మార్కులను చెక్‌చేసుకోండి!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు