News
News
X

'గ్రూప్‌-2' ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ - వారం రోజుల్లో పరీక్ష తేదీ ప్రకటన!

గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం..

FOLLOW US: 
Share:

తెలంగాణలో గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.

మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే గ్రూప్‌-2 పరీక్ష తేదీను మాత్రం టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అంతా కుదిరితే వారంరోజుల్లో పరీక్ష తేది వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని అధికారులు వెల్లడించనున్నారు.

గ్రూప్‌-2 పరీక్ష తేదీపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు వెలువడంతో ఒకే తేదీన ఏ రెండు పరీక్షలు ఉండకూడదనే ఉద్ధేశంతో గ్రూప్‌-2 పరీక్ష తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దీనికనుగుణంగా పరీక్ష తేదీలను నిర్ణయిస్తున్నారు. గ్రూప్‌-3కి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు గడువు ఉంది. అయితే గురువారం సాయంత్రం 7 గంటల వరకు గ్రూప్‌-3కు దాదాపు 4.10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.

అయితే గ్రూప్‌-2, గ్రూప్‌-3కు భారీ పోటీ నెలకొంది. గ్రూప్‌-3కు ఇంకా గడువు ఉండంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన గ్రూప్‌-4కు 9.60 లక్షలు దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు...

* గ్రూప్-2 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 17 Feb 2023 06:51 PM (IST) Tags: TSPSC Group 2 Notification TSPSC Group 2 Recruitment TSPSC Group 2 Application Group 2 Application Last date TSPSC Group 2 Applications

సంబంధిత కథనాలు

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?