అన్వేషించండి

TSPSC: గ్రూప్‌-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో ఆఖరు, వివరాల్లో తప్పులుంటే మార్చుకోండి

తెలంగాణలో గ్రూప్‌-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.

తెలంగాణలో గ్రూప్‌-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.  వెబ్‌సైట్‌ ద్వారా ఎడిట్‌ చేసుకోవాలని, మెయిల్‌ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోబోమని కమిషన్‌ తెలిపింది. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో పొందుపరచాలని సూచించింది. అభ్యర్థులకు ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం ఉందని, మరోసారి అవకాశం ఇవ్వబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. 

తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్‌-3 పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2(హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది.

TSPSC: గ్రూప్‌-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో ఆఖరు, వివరాల్లో తప్పులుంటే మార్చుకోండి

పోస్టుల వివరాలు..

* గ్రూప్-3 పోస్టులు

పోస్టుల సంఖ్య: 1375

1) జూనియర్ అసిస్టెంట్: 667 పోస్టులు

2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు

3) ఆడిటర్: 126 పోస్టులు

4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు

5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు

6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు 

7) అకౌంటెంట్: 01 పోస్టు

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Notification

ALSO READ:

తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
లక్షలాది మంది విద్యార్థుల అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, TSPSC చైర్మన్, కార్యదర్శులతో ఈ విషయంపై చర్చించారు. తాజాగా టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీలలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో మొత్తం 4 పేపర్ల పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రూప్-2 పరీక్ష పూర్తి వివరాలను క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget