News
News
X

TSPSC AEE Recruitment: ఏఈఈ పోస్టుల దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిచేసుకోండి!

ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. నవంబరు 22 నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకు వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

FOLLOW US: 

తెలంగాణలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. నవంబరు 22 నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకు వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌లింక్‌ను టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసింది. 

దరఖాస్తు వివరాల సవరణ కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు.

ఏఈఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వాస్తవానికి అక్టోబరు 15 దరఖాస్తుకు చివరితేది కాగా.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

News Reels

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

 1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). AMIE (సివిల్) పరీక్ష అర్హత ఉండాలి. 

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్  ఇంజినీరింగ్). 

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్). 

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). 


వయోపరిమితి
: 01.07.2022  నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.

జీతం: రూ.54,220- రూ.1,33,630.


ముఖ్యమైన తేదీలు..

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.    

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించారు)   

Notification

Website

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

 

:: ఇవీ చదవండి ::

ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 22 Nov 2022 07:29 PM (IST) Tags: TSPSC Recruitment 2022 TSPSC Notifications TSPSC AEE Recruitment TSPSC AEE Application Window TSPSC AEE Application Correction

సంబంధిత కథనాలు

TS Kanti Velugu Jobs:  'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

TS Kanti Velugu Jobs: 'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

TS Police Recruitment: ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట, హైకోర్టు ఆదేశాలకు 'సుప్రీం' ఓకే!

TS Police Recruitment: ఆ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట, హైకోర్టు ఆదేశాలకు 'సుప్రీం' ఓకే!

TSPSC Gazetted Posts Recruitment: తెలంగాణలో గెజిటెడ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

TSPSC  Gazetted  Posts Recruitment: తెలంగాణలో గెజిటెడ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్