News
News
X

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, కటాఫ్‌ మార్కులు తగ్గాయోచ్!! కొత్త కటాఫ్ ఇదే!

తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఎస్సై, కానిస్టేబుల్ రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 

తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని  తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి అక్టోబర్ 2న ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్ మార్కులు ఓసీలకు 40 శాతం; బీసీలకు 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతంగా ఉండేవి.

గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్‌గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓసీలకు, బీసీలకు మాత్రమే కటాఫ్ మార్కుల్ని తగ్గించి తమకు మాత్రం యథాతథంగా ఉంచారనే ఆందోళన నెలకొంది. ఈ విషయం శాసనసభలో ప్రస్తావనకు రావడంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకూ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు మండలి సన్నాహాలు చేసింది. కానీ కటాఫ్ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. తాజా నిర్ణయం వెలువడటంతో ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.


ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు సమాచారమివ్వాలి: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
ప్రాథమిక రాతపరీక్ష రాసిన మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆ కోటాతో పాటు వయో పరిమితి సడలింపు లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారాన్ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత ఖాతాలో ఉంచాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 12 గంటలవరకు వివరాలు సమర్పించాలన్నారు. పెన్షన్‌ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జి బుక్, సంబంధిత యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ నుంచి నిరభ్యంతర పత్రంలో ఏదో ఒక ప్రతిని స్కాన్ చేయాలని సూచించారు. గడువులోగా ఆ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే వయో పరిమితి సడలింపు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.

News Reels

Also Read:

SSC Recruitment: భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు, అర్హతలివే!
భారత వాతావరణ శాఖలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


SSC CGL Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 03 Oct 2022 07:27 AM (IST) Tags: TSLPRB minimum qualifying marks SCT Cutoff Marks SI Cutoff Marks PC Cutoff Marks TSLPRB Qualifying Marks TS Constable Qualifying Marks

సంబంధిత కథనాలు

Indian Airforce: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

Indian Airforce: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Indian Navy Agniveer Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Indian Navy Agniveer Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

TSPSC DAO Exam Date: డీఏఓ పోస్టుల రాతపరీక్ష తేదీ ఖరారు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC DAO Exam Date: డీఏఓ పోస్టుల రాతపరీక్ష తేదీ ఖరారు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Telanagana Jobs: మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!

Telanagana Jobs: మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి