News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం కటాఫ్‌ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్‌ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్‌, ఇతర కేసుల వెరిఫికేషన్‌ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు జూన్‌ 14 నుంచి 26 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఇంటిమేషన్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఈ లెటర్లు జూన్‌ 11 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది.

దరఖాస్తు వివరాల్లో తప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన జరిగే ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కేంద్రంలోనే అప్లికేషన్‌ ఎడిటింగ్‌/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు బోర్డు తెలిపింది. 

ఇవి గమనించండి..
➥ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలని కోరింది.

➥ వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (జూన్‌ 2, 2014 తర్వాత), బీసీ అభ్యర్థులు నాన్‌ క్రీమిలేయర్‌ సర్టిఫికెట్‌ (2021 ఏప్రిల్‌ 1 తర్వాత), ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు (2021 ఏప్రిల్‌ 1 తర్వాత), ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్‌, జిరాక్స్‌ల సెట్‌ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల‌ని సూచించింది.

➥ వీటితో పాటుగా ఇంటిమేషన్‌ లెటర్‌, ట్రాన్సాక్షన్‌ ఫామ్‌, పార్ట్‌-2 అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, ఏజ్‌ రిలేటెడ్‌, లోకల్‌ కాండిడేచర్‌ రిలేటెడ్‌, రిజర్వేషన్‌ బెనిఫిట్‌ రిలేటెడ్‌, ఏజ్‌ రిలాక్షేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హారిజంటల్‌ రిజర్వేషన్‌ బెనిఫిట్స్‌ రిలేటెడ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని బోర్డు సూచించింది.

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

శిక్షణకు వడివడిగా ఏర్పాట్లు..
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్‌ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 09 Jun 2023 10:55 PM (IST) Tags: TSLPRB Certificate Verification TS Police Certificate Verification Document Verification SI Certificate Verification Constable Certificate Verification

ఇవి కూడా చూడండి

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు

JL Exam Key: జేఎల్‌ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

JL Exam Key: జేఎల్‌ రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు

తెలంగాణలో గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణలో గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు  చేసిన హైకోర్టు

టాప్ స్టోరీస్

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?