అన్వేషించండి

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

తెలంగాణ పోలీసు విభాగంలో ఎస్‌సీటీ ఎస్‌ఐ (పీటీవో) ఉద్యోగాల భర్తీకి మార్చి 26న నిర్వహించిన టెక్నికల్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 60.92 శాతం హాజరు నమోదైంది.

తెలంగాణ పోలీసు విభాగంలో ఎస్‌సీటీ ఎస్‌ఐ (పీటీవో) ఉద్యోగాల భర్తీకి మార్చి 26న నిర్వహించిన టెక్నికల్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 26న  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించినట్లు బోర్డు తెలిపింది.

ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్షకు మొత్తం 975 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారిలో 594 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 60.92 శాతం హాజరు నమోదైంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా డిజిటల్ వేలిముద్రలు, డిజిటల్ ఫోటోగ్రాఫ్‌లు, అభ్యర్థి ప్రత్యేక గుర్తింపును నిర్ధారించడానికి అభ్యర్థుల బయోమెట్రిక్ ధ్రువీకరించినట్లు తెలిపింది.

త్వరలోనే ఆన్సర్ కీ..
త్వరలోనే ఎస్‌సీటీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్ పేపర్ ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. టెక్నికల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. త్వరలోనే కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

మిగతా పరీక్షల తేదీలు ఇలా..

➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు. 

Also Read:

IISER లో 21 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.  పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!
ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్‌ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Embed widget