Free Coaching: తెలంగాణ స్టడీ సర్కిళ్లలో 'గ్రూప్స్' ఉచిత శిక్షణ, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థికి మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున స్టయిపెండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని 15 బీసీ స్టడీ సర్కిళ్లు, స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 182 మంది 'గ్రూప్-1' మెయిన్స్‌కు అర్హత సాధించారని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ స్టడీ కేంద్రాల పరిధిలో జనవరి 25 నుంచి మూడు నెలల పాటు ప్రధాన పరీక్ష శిక్షణ తరగతులుంటాయని పేర్కొన్నారు.
ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ స్టడీ సెంటర్లలో వంద మంది చొప్పున, హైదరాబాద్ స్టడీ సెంటర్‌లో 200 మంది.. మొత్తం 500 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. ఇప్పటికే స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు నేరుగా ప్రధాన పరీక్ష శిక్షణకు హాజరు కావాలని, శిక్షణ తీసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరిలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థికి మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున స్టయిపెండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు. గ్రూప్-2 ఉచిత శిక్షణకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20తో ముగియనుంది.
అదేవిధంగా గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమౌతున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల కాల వ్యవధితో నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో డిగ్రీ మార్కుల ఆధారంగా కేవలం 100 మంది అభ్యర్థులనే ఈ శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వివరాలకు వెబ్‌సైట్‌ను లేదా 040-23546552 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. దరఖాస్తు కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
Notification
Online Application
Website
Also Read:
'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
'స్కాలర్‌షిప్' దరఖాస్తుకు ఇక కొద్దిరోజులే గడువు, దరఖాస్తుకు 3 లక్షల మంది దూరం! మరోసారి పొడిగిస్తారా?
తెలంగాణలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు సంబంధించిన కొత్త దరఖాస్తు, రెన్యూవల్ గడువు జనవరి 31తో ముగియనుంది. దరఖాస్తుకు మరో 13 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడువు సమీపిస్తున్నా.. ఇప్పటికీ 3 లక్షల మంది దరఖాస్తుకు దూరంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొత్త విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..