TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
గ్రూప్-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 2న ప్రకటించింది. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
గ్రూప్-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 2న ప్రకటించింది. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్-4 పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు 9 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి జనవరి 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల సౌలభ్యం కోసం మరో నాలుగురోజులు పొడిగించారు.
గ్రూప్-4లో 141 కొత్త పోస్టులు..
గ్రూప్-4లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8180కి చేరింది. ఇప్పటివరకు 8039గా ఉన్న ఖాళీల సంఖ్య మహాత్మాజ్యోతిభాపూలే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేశారు. దీంతో 289గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 430కి చేరింది. అదేవిధంగా మొత్తం గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య 8180కి చేరినట్లయింది.
గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు 2023, జనవరి 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంటే 1129 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తొలిగించింది. పంచాయతీరాజ్ విభాగంలో 1245 పోస్టులకుగాను కొన్నింటికి మాత్రమే ఆ శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మిగిలిన ఖాళీల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పోస్టుల సంఖ్య తగ్గించాల్సి వచ్చింది. దీంతో కేవలం 37 పోస్టులను మాత్రమే నోటిఫై చేసింది. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో మొత్తంగా 1208 పోస్టులను తొలగించినట్లయింది. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచడంతో తొలగించిన మొత్తం పోస్టుల సంఖ్య 1129కి చేరింది.
ఇక పంచాయతీరాజ్ విభాగంలో 1208 పోస్టులను తొలగించగా.. మరికొన్ని విభాగాల్లో 79 పోస్టులను పెంచారు. వీటిలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీల సంఖ్య ఒక పోస్టు పెరిగి 742 నుంచి 743 కి చేరింది. ఇక రెవెన్యూ విభాగంలో 19 పెరిగాయి. దీంతో ఆ విభాగంలో ఖాళీల సంఖ్య 2077 నుంచి 2096కి పెరిగింది. ఇక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విభాగంలో ఏకంగా 59 కొత్త పోస్టులను చేర్చారు. దీంతో ఈ విభాగంలో 18గా ఉన్న ఖాళీల సంఖ్య ఏకంగా 77 కి చేరింది. అదేవిధంగా తాజాగా బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేయడంతో గ్రూప్-4లో మరిన్ని పోస్టులు వచ్చి చేరాయి. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8180కి చేరింది.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 8180 పోస్టులు
1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.
2) జూనియర్ అసిస్టెంట్: 5871 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు:
వ్యవసాయశాఖ-44 | బీసీ సంక్షేమశాఖ-448 | పౌరసరఫరాల శాఖ-72 | అటవీశాఖ-23 |
వైద్యారోగ్యశాఖ-338 | ఉన్నత విద్యాశాఖ-743 | హోంశాఖ-133 | నీటిపారుదల శాఖ-51 |
మైనార్టీ సంక్షేమశాఖ-191 | పురపాలక శాఖ-601 | పంచాయతీరాజ్-37 | రెవెన్యూశాఖ-2,096 |
సెకండరీ విద్యాశాఖ-97 | రవాణాశాఖ-20 | గిరిజన సంక్షేమ శాఖ-221 | మహిళా, శిశు సంక్షేమం-77 |
ఆర్థికశాఖ-46 | కార్మికశాఖ-128 | ఎస్సీ అభివృద్ధి శాఖ-474 | యువజన సర్వీసులు-13 |
3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు
విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్
4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు
విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.01.2023.
➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.
పోస్టుల అర్హతలు, నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..