అన్వేషించండి

TREIRB: గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

తెలంగాణలో గురుకుల నియామ‌క ప‌రీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి 22 వ‌ర‌కు ప‌రీక్షలు జరగాల్సి ఉండగా.. జులై 23 వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణలో గురుకుల నియామ‌క ప‌రీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి 22 వ‌ర‌కు కంప్యూట‌ర్ ఆధారిత రాత ప‌రీక్షలు జరగాల్సి ఉండగా.. ఆగస్టు 23 వరకు నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 24న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు సంబంధించిన రాత ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 1 నుంచి 23 వ‌ర‌కు మూడు షిఫ్ట్‌ల్లో నిర్వహించ‌నున్నారు. మొద‌టి షిఫ్ట్ ఉద‌యం 8:30 నుంచి 10:30 వ‌ర‌కు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మ‌ధ్యాహ్నం 2:30 వ‌ర‌కు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.66 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా టీజీటీ, పీజీటీ పోస్టులకు కలిపి 1.6 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. టీజీటీ పోస్టులు నాలుగు వేలు ఉండగా.. ఈ పోస్టులకు మాత్రమే వచ్చిన దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. మరోవైపు  పీజీటీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య 60 వేలు దాటాయి. ఒకే అభ్యర్థి గరిష్ఠంగా ఏడు పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించడంతో.. కొందరు అభ్యర్ధులు తాము అర్హత కలిగిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు ఓటీఆర్‌ల సంఖ్య 1.5 లక్షలకుపైగా వచ్చాయి.

గురుకుల నియామక పరీక్షల కొత్త షెడ్యూలు ఇలా..

TREIRB: గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?TREIRB: గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?TREIRB: గురుకుల నియామ‌క పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

పోస్టుల వివరాలు..

క్ర.సం. పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9210

ALSO READ:

ఎఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget