News
News
X

TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 833 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 833 ఇంజినీరింగ్ పోస్టులకు తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.

FOLLOW US: 
Share:

TS Govt Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీచేసింది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చని సూచించింది. ఉద్యోగ అర్హతలు, వయో పరిమితి ఇతర వివరాలను https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 

పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టులకు నోటిఫికేషన్ 

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. తాజాగా మరో 529 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో  కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా  పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు సెప్టెంబరు 9న ఆదేశాలు జారీ చేశారు. 

వరుస నోటిఫికేషన్లు 

ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జారీచేసి ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ 253, సీనియర్ అసిస్టెంట్ 173, సూపరింటెండెంట్ 103 పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు. జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్ 4 కింద నోటిఫై చేసిన 9వేల పైచిలుకు పోస్టుల్లో వీఆర్ఓల భర్తీ కారణంగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటిస్థానాల్లో ఈ కొత్త పోస్టులను ప్రభుత్వానికి చూపించనున్నట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థికశాఖ అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

మున్సిపల్ శాఖలో 

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

Also Read : TSPSC: ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!

Also Read:  TSPSC: మహిళలకు గుడ్‌న్యూస్ - టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!

Published at : 12 Sep 2022 09:27 PM (IST) Tags: Govt Jobs Jobs TSPSC TS News Telangana news Engineering posts

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌