Telangana Anganwadi Recruitment 2021: టెన్త్ అర్హతతో 109 అంగన్‌వాడీ పోస్టులు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు
Anganwadi jobs 2021: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నల్లొండ జిల్లాలోని 109 ఖాళీలను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 16తో ముగియనుంది.
తెలంగాణలో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం (ఐసీడీఎస్) పరిధిలోని 109 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అకడమిక్ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లాలోని అనుమల, చింతపల్లి, దామర చర్ల, దేవర కొండ, కొండ మల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఈ నియమకాలు చేపట్టనున్నారు.
ఆగస్టు 16వ తేదీతో..
ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 16వ తేదీతో ముగియనుంది. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు విషయంలో పరిమితులు ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉండే వివాహిత మహిళలు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://mis.tgwdcw.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
Also Read: ఎస్ఎస్‌బీలో హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. రూ.81 వేల వరకూ జీతం..
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు- 109
అంగన్‌వాడీ టీచర్ - 23
మినీ అంగన్ వాడీ టీచర్ - 7
సహాయకులు - 79
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి..
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు, నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను (నివాస ధ్రువీకరణ, ఎస్ఎస్‌సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం మొదలైనవి) సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టు 20 నుంచి 30వ తేదీ వరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలలో జరగనున్న వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తీసుకువెళ్లాలి. ఇవి లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తారు.
మైనారిటీ జూనియర్ కాలేజీల్లో 840 జేఎల్ పోస్టులు..
తెలంగాణలో 840 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 111 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో జేఎల్ పోస్టులను భర్తీ చేయనుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. అదే విధంగా 12 టీఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలన్నీ కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతాయి.