అన్వేషించండి

TCS Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్, 12 వేల మందిని తొలగించాలని నిర్ణయం

Tata Consultancy Services layoffs | క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో, కొత్త ప్రాజెక్టులపై జాప్యం చేస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ CEO కృతివాసన్ తెలిపారు.

TCS set to lay off more than 12000 employees | భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏకంగా 12000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు  ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2026లో తమ మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందిని తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ తొలగింపు ప్రధానంగా కంపెనీలోని మీడియం, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. 

కంపెనీ అధికారిక ప్రకటన విడుదల

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతోంది. కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెంచాలని చూస్తోందని టీసీఎస్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు, కంపెనీ తన ఉద్యోగులందరికీ ఏఐ టూల్స్ మీద తిరిగి శిక్షణ ఇస్తోంది. ఈ టెక్నాలజీపై తిరిగి నియామకాలు సైతం చేపడుతోంది. భారీ లేఆఫ్స్ ప్రక్రియలో కంపెనీకి చెందిన దాదాపు 12,200 మంది ఉద్యోగాలు కోల్పోతారు.

పూర్తి జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా మార్పులు

TCS సంస్థ ప్రకటనలో ఏముందంటే.. "ఈ మొత్తం మార్పు ప్రక్రియ చాలా జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. దాంతో ఈ మార్పులు మా కస్టమర్ సేవలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భారతదేశంలో 283 బిలియన్ డాలర్ల IT రంగం ఉంది. ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో పరిస్థితులు మారుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అమెరికా వాణిజ్య విధానాలకు సంబంధించిన అనిశ్చితి కారణంగా కంపెనీ అనవసరమైన సాంకేతిక ఖర్చులను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది"

కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడంలో ఆలస్యం - కె. కృతివాసన్

అదే సమయంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కె. కృతివాసన్ మాట్లాడుతూ, కస్టమర్ కంపెనీలు, క్లయింట్స్ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయని చెప్పారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఇది సంస్థ టర్నోవర్ పై సైతం ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

ప్రమాదంలో ఐటీ జాబ్స్..
ఐటీ సంస్థలు ఒక్కసారిగా లేఆఫ్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ సైతం భారీగా ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. సంస్థల అనూహ్య నిర్ణయాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సైతం దాదాపు 10 వేల మంది ఉద్యోగాలలో కోత విధించేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోత దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. పెద్ద సంస్థల నిర్ణయాలు గమనిస్తే ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 24000 మంది ఐటీ ఉద్యోగులు జాబ్ కోల్పోయే అవకాశం ఉంది. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సరికొత్త టెక్నాలజీతో పాత టెక్నాలజీని రీప్లేస్ చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. తద్వారా గతంలో 5 నుంచి 10 మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ సాయంతో ఒకరిద్దరు ఉద్యోగాలు చేస్తారని టెక్ దిగ్గజాలు అంచనా వేస్తున్నారు. అదే దిశగా ప్రముఖ ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగాలలో కోత విధించడంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు అని లేఆఫ్స్ నిర్ణయాలకు వెళ్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget