అన్వేషించండి

SBI Clerk Result: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎస్‍బీఐ క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ప్రిలిమ్స్ 2023 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

SBI Clerk Result 2024: ఎస్‍బీఐ క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ప్రిలిమ్స్ 2023 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలను జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 25, మార్చి 4న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

SBI Clerk Prelims ఫలితాలు చూసుకోండిలా..

➥ ఫలితాల కోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- sbi.co.in

➥ అనంతరం అక్కడ హోంపేజీలో కనిపించే కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.

➥ అందులో ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.

➥ ఆ లింక్‍పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయాలి.

➥  లాగిన్ వివరాలు ఎంటర్ చేశాక.. రిజల్ట్స్ స్క్రీన్‍పై కనిపిస్తాయి.

➥ భవిష్యత్తు అవసరాల కోసం ఆ రిజల్ట్స్ ను డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) పోస్టుల భర్తీకి నవంబరు 17న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8773 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 8283 రెగ్యులర్ పోస్టులుకాగా.. 490 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 17 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

పరీక్ష విధానం:

ప్రిలిమినరీ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, జనవరి 5, 6, 11, 12 తేదీల్లో  ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు (25 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటి-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు (1 గంట)

మెయిన్ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, ఫిబ్రవరిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు(35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు (45 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు (45 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.

పే స్కేలు: Rs.17,900 - రూ.47,920.

బేసిక్‌పే: రూ.19,900. (రూ.17900తోపాటు రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఉంటాయి.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget