అన్వేషించండి

SSC CPO Result: సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ పేపర్-2 పరీక్ష ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 14,213 మంది ఎంపిక!

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లో 4,300 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్‌-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో 4,300 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్‌-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో తర్వాతి దశకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రెండు జాబితాల్లో పొందుపరిచింది. వీటిలో మొదటి జాబితాలో పేపర్-2లో అర్హత సాధించిన మహిళల వివరాలు, ఇక రెండో జాబితాలో అర్హత సాధించిన పురుషుల వివరాలు ఉన్నాయి. 

ఎస్‌ఐ రాతపరీక్షకు సంబంధించి మొత్తం 14,213 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. వీరిలో పురుషులు- 13,168 మంది, మహిళలు-1045 మంది ఉన్నారు. వీరికి త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన కేంద్రాల్లో మే 2న పేపర్‌-2 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక ఆనర్స్ 'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 11న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేసింది. 

LIST OF FEMALE CANDIDATES (LIST-1)

LIST OF MALE CANDIDATES (LIST-2)

Cut-off Marks

అంతకు ముందు ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ఫిజిక్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను మార్చి 24న విడుదల చేశారు. అప్పుడు మొత్తం 15,743 మంది అభ్యర్థులు పేపర్-2 కు అర్హత సాధించారు. వీరిలో పురుషులు-14,628, మహిళలు-1,115 మంది ఉన్నారు. వీరికి మే 2న పేపర్-2 పరీక్ష నిర్వమించారు.

ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 4300 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నవంబరు 9 నుంచి 11 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించింది. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించింది. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్-2 పరీక్ష నిర్వహించింది. తాజాాగా పేపర్-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు: 4300

1)  సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) - సీఏపీఎఫ్: 3960 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-1583, ఈడబ్ల్యూఎస్-377, ఓబీసీ-1090, ఎస్సీ-611, ఎస్టీ-299.

పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.

2)  సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మెన్/ఉమెన్) - ఢిల్లీ పోలీస్: 340 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-154, ఈడబ్ల్యూఎస్-34, ఓబీసీ-81, ఎస్సీ-45, ఎస్టీ-26.

పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కుల వివరాలు ఇలా..

 

List-1:


List-2:

Also Read:

ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 29 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget