అన్వేషించండి

SSC JE Exam Key: ఎస్‌ఎస్‌సీ జేఈ రాతపరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో  జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాతపరీక్ష ఆన్సర్ 'కీ'ని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల అక్టోబరు 13న విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో  జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాతపరీక్ష ఆన్సర్ 'కీ'ని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల అక్టోబరు 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ సాయంతో ప్రశ్నపత్రం, కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీపై  అభ్యంతరాలను అక్టోబర్‌ 13న సాయంత్రం 5 గంటల నుంచి అక్టోబర్‌ 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, ఫైనల్ కీతోపాటు పేపర్-1 ఫలితాలను వెల్లడించనున్నారు.

జేఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 9 నుంచి 11 వరకు పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పేపర్-2 (డిస్క్రిప్టివ్‌) పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుదిఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. 

జేఈ ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి.. 

పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

SSC JE Exam Key: ఎస్‌ఎస్‌సీ జేఈ రాతపరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.

జేఈ పోస్టుల నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో 91 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget