SSC Constable (GD) Recruitment: అదనంగా 20 వేల కానిస్టేబుల్ పోస్టులు, 45 వేలకు చేరిన ఖాళీల సంఖ్య - రేపటితో దరఖాస్తుకు ఆఖరు!
మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. వీటిలో 40,274 పురుషులకు, 4835 మహిళలకు కేటాయించారు. వీటిలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 175 పోస్టులను కేటాయించారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఇటీవల 24,369 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్, సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాళీల సంఖ్యను ఎస్‌ఎస్‌సీ భారీగా పెంచింది. ప్రకటించిన పోస్టులకు అదనంగా 20,915 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పెరిగిన పోస్టుల వివరాలను అందుబాటులో ఉంచింది. మొత్తం పోస్టుల్లో 40,274 పురుషులకు, 4835 మహిళలకు కేటాయించారు. వీటిలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 175 పోస్టులను కేటాయించారు.
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే పోస్టుల సంఖ్య పెరగడంతో.. అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం ఉంది.
* పోస్టుల వివరాలు...
విభాగాల వారీగా ఖాళీలు..
1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 20,765
2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 5914
3) సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169
4) సశస్త్ర సీమాబల్ (SSB): 2167
5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1787
6) అసోం రైఫిల్స్ (AR): 3153
7) సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 154
8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. 02.01.2000 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు 5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవర్‌నెస్-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు కోత విధిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.10.2022
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022 (23:00)
* చలానా జనరేట్ చేయడానికి చివరితేది: 30.11.2022 (23:00)
* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.12.2022 (23:00)
* చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.12.2022.
* సీబీటీ పరీక్ష తేదీ: 2023 జనవరిలో.
Notification
Online Application
Website
Also Read:
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!! - డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించి అడ్మిట్ కార్డులను పోలీసు నియామక మండలి నవంబర్ 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 3 వరకు ఈ అడ్మిట్ కార్డులు వెబ్‌సైట్‌లో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, ఫిజికల్ ఈవెంట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..