SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) 50,187 ఉద్యోగాలకు నిర్వహించిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 8న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) 50,187 ఉద్యోగాలకు నిర్వహించిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 8న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) ఇటీవల ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను ఏప్రిల్ 14 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
List-I: List of female candidates qualified for PET/ PST
List-II (A): List of male candidates Qualified for Appearing in PET/ PST
List-II (B): List of male candidates Qualified for Appearing in PET/ PST
List-III: List of candidates whose category changed to UR (Unreserved)
కటాఫ్ మార్కుల వివరాలు...
LIST-I: List of female candidates qualified for PET/ PST
List-II (A): List of male candidates Qualified for Appearing in PET/ PST
List-II (B): List of male candidates Qualified for Appearing in PET/ PST
List-III: List of candidates whose category changed to UR (Unreserved)
Also Read:
సీఆర్‌పీఎఫ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
సీఆర్‌పీఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,29,929 ఉద్యోగాల్లో 1,25,262 పోస్టులకు పురుష అభ్యర్థులు, 4,667 పోస్టులను మహిళలకు కేటాయించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..