CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
సీఆర్‌పీఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ (జీడీ) ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఆర్‌పీఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,29,929 ఉద్యోగాల్లో 1,25,262 పోస్టులకు పురుష అభ్యర్థులు, 4,667 పోస్టులను మహిళలకు కేటాయించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
పదోతరగతి అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు...
అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అలాగే కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల్లో 10 శాతం ఉద్యోగాలను మాజీ అగ్నివీరులకు కేటాయిస్తూ నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ ఉద్యోగాలకు వేతన శ్రేణిని రూ.21,700 నుంచి రూ.69,100గా నిర్ణయించారు. పదవీ విరమణ విరమణ వయస్సును 60 సంవత్సరాలుగా నిర్ణయించారు.
➥ ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షతో పాటు రాత పరీక్ష, మెడికల్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మాజీ అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించారు.
➥ ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది. అయితే, ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన తేదీలను మాత్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ/ సీఆర్‌పీఎఫ్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read:
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌లో 68 ఇంజినీర్ ఉద్యోగాలు, అర్హతలివే!
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 68 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టునిఅనుసరించి బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..