PGCIL Recruitment: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 138
పోస్టుల కేటాయింపు: జనరల్-58, ఓబీసీ-35, ఎస్సీ-20, ఎస్టీ-13, ఈడబ్ల్యూఎస్-12.
* ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్: 83
➥ సివిల్: 20
➥ ఎలక్ట్రానిక్స్: 20
➥ కంప్యూటర్ సైన్స్: 15
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. గేట్ 2023 అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2023
➥ దరఖాస్తు చివరితేది:18.04.2023.
Also Read:
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!
మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/10వ తరగతి/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/డిప్లొమా/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!
ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2న నిర్వహించనున్న ఫైనల్ పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి మార్చి 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫోన్ నెంబర, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..