News
News
వీడియోలు ఆటలు
X

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2న నిర్వహించనున్న ఫైనల్ పరీక్ష హాల్‌టికెట్లను TSLPRB విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2న నిర్వహించనున్న ఫైనల్ పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి మార్చి 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫోన్ నెంబర, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

రాత పరీక్షను ఏప్రిల్ 2న హైదరాబాద్ కేంద్రంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 31న అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. మండలి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని స్పష్టంచేశారు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

పరీక్షల తేదీలు ఇలా..

➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.

➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు. 

Also Read:

ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 28 Mar 2023 11:11 PM (IST) Tags: SCT PC Driver Exam Driver Operator Posts Exam SCT PC (Mechanic) Technical Exam TSLPRB Technical Exam

సంబంధిత కథనాలు

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!