News
News
వీడియోలు ఆటలు
X

SSC CHSLE - 2022: సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2022 'టైర్-1' ఫలితాలు విడుదల- తర్వాతి దశకు 40,224 మంది ఎంపిక!

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2022 టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSLE)-2022 టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచింది. ఫలితాల్లో మొత్తం 40,224 మంది అభ్యర్థుల తర్వాతి దశలో నిర్వహించే టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. ఫలితాలతోపాటు కేటగిరీలవారీగా అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2022 టైర్-1 పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 9 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష ఆన్సర్ కీని మార్చి 31న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అమార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా టైర్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.

కటాఫ్ మార్కుల వివరాలు ఇలా..

'టైర్-1'‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలు ఇలా..

సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల వివరాలు..
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. తాజాగా టైర్-1 పరీక్షల నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకించింది. 

సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.

టైర్-2 పరీక్ష విధానం..

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 20 May 2023 09:26 AM (IST) Tags: SSC CHSL Result 2023 SSC CHSL Tier 1 Results SSC CHSL Results 2023 SSC CHSL Tier 2 Candidates List CHSL Tier-I Results 2023

సంబంధిత కథనాలు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

టాప్ స్టోరీస్

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ