SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 'టైర్-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2023 'టైర్-1' రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 28న విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ)-2023 'టైర్-1' రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. మొత్తం మూడు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.
ఫలితాలకు సంబంధించి మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, రెండో జాబితా(లిస్ట్-2)లో డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, ఇక మూడో జాబితా(లిస్ట్-3)లో డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ మినహాయించి) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచింది.
ఎల్‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు సంబంధించి 17,495 మంది అభ్యర్థులు, డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ) పోస్టులకు సంబంధించి 754 మంది అభ్యర్థులు, డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ మినహాయించి) పోస్టులకు సంబంధించి 1307 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షలకు అర్హత సాధించారు. తర్వాతి దశలో టైర్-2 పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
List-2: DEO in CAG/CAFPD Results
List-3: DEO other than CAG/CAFPD Results
పెరిగిన పోస్టులు..
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023(సీహెచ్‌ఎస్‌ఎల్)కు పోస్టుల సంఖ్య పెంచినట్లు సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 162 పోస్టులను చేర్చింది. దీంతో గతంలో ఖాళీల సంఖ్య 1,600 ఉండగా.. తాజాగా మొత్తం ఖాళీల సంఖ్య 1,762కి చేరింది. ఖాళీల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి మే నెలలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయగా ఆగస్టులో టైర్-1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
టైర్-2 పరీక్ష విధానం..
స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..
✦ టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టులకు గంటకు 8000 కీ డిప్రెషన్స్ కంప్యూటర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు.
✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 పదాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.