AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెంగా ఊపారు. దాదాపు వెయ్యికి పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెంగా ఊపారు. కాగా బుధవారం (మే 25) ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.
దాదాపు వెయ్యికి పైగా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వీటిలో గ్రూప్-1 పరిధిలో 100 పోస్టులు, గ్రూప్-2 పరిధిలో 900 పోస్టులకు పైగా ఉండే అవకాశం ఉంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని పేర్కొన్నారు.
Also Read:
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 60 డేటా అనలిస్ట్&సైంటిస్ట్ ఉద్యోగాలు- అర్హతలివే!
న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్(డీఐసీ) డేటా అనలిస్ట్&డేటా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తపాలా శాఖలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్ సైకిల్ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..