అన్వేషించండి

SBI PO: ఎస్‌బీఐ పీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఎస్‌బీఐ పీవో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు.

'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి  సెప్టెంబరు 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 27 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు..

* ప్రొబేషనరీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 2,000 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.04.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.

➥ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 27.09.2023 వరకు.

➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.

➥ స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.

➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

➥ స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

➥ ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.

➥ తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/ మార్చి 2024.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2023, అక్టోబరు మొదటివారం నుంచి.

ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2023, అక్టోబరు రెండోవారం నుంచి.

Notification

Online Application

ALSO READ:

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలిలా
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Embed widget