RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1679 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
NCR: ప్రయాగ్‌రాజ్ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న నార్త్ సెంట్రల్ రైల్వే(NCR)- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
North Central Railway Aapprentices: ప్రయాగ్‌రాజ్ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న నార్త్ సెంట్రల్ రైల్వే(NCR)- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1679 పోస్టులు
⏩ ప్రయాగ్‌రాజ్ (PRYJ) డివిజన్(మెకానికల్ డిపార్ట్‌మెంట్): 364
ఫిట్టర్- 335
వెల్డర్- 13
కార్పెంటర్- 11
పెయింటర్ (జనరల్)- 05
⏩ ప్రయాగ్‌రాజ్ (PRY) డివిజన్(ఎలక్ట్రానిక్ డిపార్ట్‌మెంట్): 339
ఫిట్టర్- 246
వెల్డర్(జి&ఈ)- 09
ఆర్మేచర్‌విండర్- 47
కార్పెంటర్- 05
క్రేన్- 08
మెషినిస్ట్- 15
పెయింటర్ (జనరల్)- 07
ఎలక్ట్రీషియన్- 02
⏩ ఝాన్సీ (జేహెచ్‌ఎస్) డివిజన్: 497
ఫిట్టర్- 229
ఎలక్ట్రీషియన్- 123
మెకానిక్ (DSL)- 58
పెయింటర్- 04
కార్పెంటర్- 07
బ్లాక్ స్మిత్- 04
వెల్డర్- 14
టర్నర్- 03
మెషినిస్ట్- 04
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్అసిస్టెంట్(సీవోపీఏ)- 51
⏩ వర్క్ షాప్ ఝాన్సీ: 183
ఫిట్టర్- 93
వెల్డర్- 45
ఎంఎంటీఎం- 0
మెషినిస్ట్- 15
పెయింటర్- 13
ఎలక్ట్రీషియన్- 16
స్టెనోగ్రాఫర్ (హిందీ) - 01
⏩ ఆగ్రా(ఏజీసీ) డివిజన్: 296
ఫిట్టర్ - 80
ఎలక్ట్రీషియన్- 125
వెల్డర్- 15
మెషినిస్ట్- 05
కార్పెంటర్- 05
పెయింటర్- 05
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్- 08
ప్లంబర్- 05
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 05
స్టెనోగ్రఫీ(ఇంగ్లీష్)- 04
వైర్‌మ్యాన్- 13
మెకానిక్-కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్- 15
హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్- 06
మల్టీమీడియా & వెబ్ పేజీ డిజైన్- 05
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 15.10.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నిబంధనల ప్రకారం.
అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్‌లు..
➥ ఎస్‌ఎస్‌సీ(స్టాండర్డ్ 10వ తరగతి) లేదా దానికి సమానమైన మార్క్ షీట్.
➥ పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదొవతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ లేదా పుట్టిన తేదీని సూచించే మార్క్‌షీట్ లేదా పుట్టిన తేదీని సూచించే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కాపీ.
➥ దరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌లోని అన్ని సెమిస్టర్‌ల కన్సాలిడేటెడ్ ఐటీఐ మార్క్ షీట్ / మార్కులను సూచించే ప్రొవిజినల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కాపీ.
➥ ఎన్‌సీవీటీ ద్వారా జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ ద్వారా జారీ చేయబడిన ప్రొవిజినల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కాపీ.
➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కోసం కాస్ట్ సర్టిఫికేట్ కాపీ(వర్తించే చోట).
➥ పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల కోసం వైకల్యం సర్టిఫికేట్(వర్తించే చోట).
➥ ఎక్స్- సర్వీస్‌మెన్ కోటాకు వ్యతిరేకంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విషయంలో డిశ్చార్జ్ సర్టిఫికేట్ / సర్వింగ్ సర్టిఫికేట్ కాపీ.
➥ ఎస్‌ఎస్‌సీ/ మెట్రిక్యులేషన్/10వ తరగతి పాస్ & ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ ద్వారా జారీ చేయబడిన మార్క్ షీట్‌లు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ/ఎక్స్- సర్వీస్‌మెన్ మొదలైన అన్ని సర్టిఫికేట్ కాపీలు.
➥ అభ్యర్థులు తమ కలర్ ఫోటోగ్రాఫ్ (సైజ్ 3.5 సెం.మీ x 3.5 సెం.మీ) స్కాన్ చేసిన కాపీ/సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
➥ అభ్యర్థులు తమ సంతకాన్ని స్కాన్ చేసిన కాపీ / సాఫ్ట్ కాపీని కూడా అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.09.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2024.