అన్వేషించండి

RPF Mock Tests: రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ మాక్‌ టెస్టులు అందుబాటులో - పరీక్షలు ఎప్పటినుంచంటే?

RPF Constable Mock tests: ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు నమూన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు నమూనా పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే ప్రాక్టీస్ చేయవచ్చు.

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం నమూనా పరీక్షలు (మోడల్ టెస్టులు) రూపొందించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు నమూనా పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే ప్రాక్టీస్ చేయవచ్చు. మాక్ టెస్టుల ద్వారా పరీక్షల సరళి అభ్యర్థులకు తెలియడంతో పాటు సమయపాలన, తదితర అంశాలు అవగాహనలోకి వస్తాయి. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ శక్తిసామర్థ్యాలు అంచనావేసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానిస్టేబుల్ ఆన్‌లైన్ పరీక్షలు రాయడానికి సులభతరమవుతుంది. 

గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(RPF)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(RRB) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 452 సబ్ ఇన్‌స్పెక్టర్(SI), 4208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఎస్‌ఐ పోస్టులకు పరీక్షలు ముగియగా.. మార్చిలో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. 
మార్చి 2 నుంచి పరీక్షలు..

రైల్వేశాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలను మార్చి 2 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేయగా ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు తదితర సమాచారం ఉంటుంది. ఫిబ్రవరి 27న అడ్మిట్‌కార్డులను విడుదల చేయనున్నారు. 

పరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్‌మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కుకాగా.. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

ఆర్‌పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది.

విభాగం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు  లాంగ్  జంప్ హైజంప్
ఎస్‌ఐ (మెన్) 6.30 నిమిషాలు  - 12 ఫీట్లు 3 ఫీట్ల 9 అంగుళాలు 
ఎస్‌ఐ (ఉమెన్) - 4 నిమిషాలు 9 ఫీట్లు 3 ఫీట్లు

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT):

ఆర్‌పీఎఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
విభాగం ఎత్తు (సెం.మీ.లలో ) ఛాతీ (సెం.మీ.లలో )
{పురుషులకు మాత్రమే}
జనరల్/ఓబీసీ   165 157 80 85
ఎస్సీ/ఎస్టీ 160 152 76.2 81.2
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి 163 155 80 85

డాక్యుమెంట్ వెరిఫికేషన్: 
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget