అన్వేషించండి

యువతకు గుడ్ న్యూస్! PM వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన: ఉద్యోగాల వరద, మీకోసం భారీ ప్రోత్సాహకాలు!

PM-VBR Apply Online: దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, ఉద్యోగ కల్పన కోసం మోదీ సర్కార్ ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ₹99,446 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించింది.

PM-VBR Apply Online: యువతకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన: లక్ష్యాలు, ఖర్చు

దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, ఉద్యోగ కల్పన కోసం మోదీ సర్కార్ ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ₹99,446 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం రెండేళ్ల పాటు, అంటే 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు, అమలులో ఉంటుంది. పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా దేశంలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలిసారిగా ఉద్యోగంలోకి ప్రవేశించే యువతకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల్లో దాదాపు 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగంలోకి ప్రవేశించే యువతకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకంలో విశేషం ఏమిటంటే, కేవలం యువతకు మాత్రమే కాకుండా, ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇవ్వడం.

రెండు వర్గాలకు ప్రయోజనం కల్పించనున్న పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన

1. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు లబ్ధి - ప్రైవేటు రంగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో నమోదు చేసుకున్న తర్వాత, గరిష్టంగా ₹15,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఈ పథకంలో భాగంగా అందుకుంటారు. అయితే, ఈ మొత్తం ఒకేసారి కాకుండా రెండు విడతల్లో చెల్లిస్తారు.

2. ప్రైవేటు కంపెనీలకు లాభం - కొత్తగా ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు కేంద్ర సర్కార్ ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా ₹3,000 వరకు ప్రోత్సాహం ఇస్తుంది. ఈ మొత్తం కంపెనీలకు చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రోత్సాహం ద్వారా కంపెనీలు మరింత మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రేరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ భావన. మొదట రెండేళ్లపాటు దీనిని కంపెనీలకు చెల్లిస్తారు. ఇలా దీనిని నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది.

ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన పథకం అటు ఉద్యోగంలో చేరిన యువతకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇస్తుంది. తయారీ రంగానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి ఇది కీలకంగా ఉపయోగపడనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం 2025 ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget