PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 435 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, రూ.1.40 లక్షల వరకు జీతం
PGCIL Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Power Grid Corporation of India Notification: న్యూఢిల్లీలోని 'పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)' తోపాటు సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CTUIL)లోని వివిధ విభాగాల్లో ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గతేడాది సెప్టెంబరు 26న విడుదల చేసిన నోటిఫికేషన్(Advt. No. CC/08/2023)కు అనుబంధంగా తాజా నోటిఫికేషన్‌ను PGCIL విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్-2024 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 4 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 435.
పోస్టుల కేటాయింపు: యూఆర్(జనరల్)-192, ఓబీసీ-107, ఎస్సీ-63, ఎస్టీ-34, ఈడబ్ల్యూఎస్-39.
విభాగాల వారీ ఖాళీలు..
➥ ఎలక్ట్రికల్: 331 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్: 14 పోస్టులు
➥ సివిల్: 53 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్: 37 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్-2024 ఉత్తీర్ణులై ఉండాలి. మంచి స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో గేట్ మార్కులకు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజీ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో జనరల్ అభ్యర్థులు కచ్చితంగా 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇతరులు 30 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లే.
పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.06.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.07.2024.
ALSO READ:
➥ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 164 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
➥ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు
➥ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా