(Source: ECI/ABP News/ABP Majha)
NFL Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
NFL Recruitment: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్, ఇతర ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
National Fertilizers Limited Notification: నోయిడాలోని 'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
⫸ ఖాళీల సంఖ్య: 97.
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-46, ఎస్సీ-13, ఎస్టీ-10, ఓబీసీ-20, ఈడబ్ల్యూఎస్-08.
➥ ఇంజినీర్ (ప్రొడక్షన్): 40 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ/కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ ఇంజినీర్ (మెకానికల్):15 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 12 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 11 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ Etc.). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ ఇంజినీర్ (సివిల్): 01 పోస్టు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ ఇంజినీర్ (ఫైర్ & సేఫ్టీ): 03 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైర్ & సేఫ్టీ/ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ కెమికల్/ఫైర్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్):09 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఇనార్గానిక్ కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
➥ మెటీరియల్స్ ఆఫీసర్: 06 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/మెటీరియల్ సైన్స్/మెటీరియల్ సైన్స్ & టెక్నాలజీ/మెటీరియల్ సైన్స్ & ఇంజినీరింగ్). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.05.2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
వార్షిక వేతనం: రూ.12.99 లక్షలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.07.2024.