APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి పేపర్ ప్రకటన మే 27న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి మే 27న పేపర్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మే 29న విడుదలైంది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మే 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. టెక్నికల్ కారణాల వల్ల మే 31న ప్రారంభమైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించి జూన్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు...
🔰 ఖాళీల సంఖ్య: 1,358 పోస్టులు
1) ప్రిన్సిపాల్: 92 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఓసీలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వీటితోపాటు బీఈడీ తప్పనిసరిగా ఉండాలి.
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 846 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. ఓసీలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వీటితోపాటు బీఈడీ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఒకేషనల్ సబ్జెక్టులైన అగ్రికల్చర్, అకౌంటింగ్ & టాక్సేషన్, సీఎస్‌ఈ, పీఎస్‌టీటీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, జీఎఫ్‌సీ, రిటైల్ మేనేజ్‌మెంట్ విభాగాలకు బీఈడీ అవసరంలేదు. అయితే నిర్ణీత విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలి.
3) సీఆర్‌టీ: 374 పోస్టులు
అర్హత: ఎన్‌సీఈఆర్టీకి సంబంధించి రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా కనీసం 50 శాతం మార్కులతో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఓసీలకు 50 శాతం, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉండాలి. వీటితోపాటు బీఈడీ అర్హత తప్పనిసరి లేదా తత్సమాన విభాగంలో మెథడాలజీలో డిగ్రీ ఉండాలి.
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 46 పోస్టులు
అర్హత: ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓసీలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉండాలి. (లేదా) 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. ఓసీలకు 50 శాతం, బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉండాలి. వీటితోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్ డిప్లొమా (యూజీడీపీఈడీ) ఉండాలి లేదా బీపీఈడీ/ఎంపీఈడీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి జనరల్ అభ్యర్థులకు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మెరిట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ పేపర్ నోటిఫికేషన్: 27-05-2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.05.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.06.2023.
➥ మెరిట్ జాబితా తయారు (1:3 నిష్పత్తిలో): 06.06.2023 - 07.06.2023.
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్- డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ ద్వారా: 08.06.2023 - 09.06.2023.
➥ స్కిల్ టెస్ట్/పర్సనాలిటీ టెస్ట్ (జిల్లాస్థాయిలో): 10.06.2023 - 12.06.2023.
➥ తుది ఎంపిక జాబితా: 12.06.2023.
➥ నియామక పత్రాల జారీ: 13.06.2023.
➥ ఒప్పందం అమల్లోకి: 13.06.2023.
➥ రిపోర్టింగ్ తేదీ: 14.06.2023.
Also Read:
DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాటా స్టీల్-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..