(Source: ECI/ABP News/ABP Majha)
ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 871 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, అదిరిపోయే జీతం, ఈ అర్హత తప్పనిసరి!
గేట్-2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. బీఎస్సీ, బీఈ, బీటెక్ , డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించి అక్టోబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) గేట్ స్కోర్-2022 ఆధారంగా ఇ-1 స్థాయిలో ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. బీఎస్సీ, బీఈ, బీటెక్ , డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో గేట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించి అక్టోబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
వివరాలు...
* గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 871
1) ఏఈఈ(సిమెంటింగ్)- మెకానికల్: 13 పోస్టులు
2) ఏఈ(సిమెంటింగ్)- పెట్రోలియం: 04 పోస్టులు
3) ఏఈఈ(సివిల్): 29 పోస్టులు
4) ఏఈఈ(డ్రిల్లింగ్)- మెకానికల్: 212 పోస్టులు
5) ఏఈఈ(డ్రిల్లింగ్)- పెట్రోలియం: 20 పోస్టులు
6) ఏఈఈ(ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు
7) ఏఈఈ(ఇన్‌స్ట్రుమెంటేషన్): 53 పోస్టులు
8) ఏఈఈ(మెకానికల్): 103 పోస్టులు
9) ఏఈఈ(ప్రొడక్షన్)- మెకానికల్: 39 పోస్టులు
10) ఏఈఈ(ప్రొడక్షన్)- కెమికల్: 60 పోస్టులు
11) ఏఈఈ(ప్రొడక్షన్)- పెట్రోలియం: 32 పోస్టులు
12) ఏఈఈ(పర్యావరణ): 11 పోస్టులు
13) ఏఈఈ(రిజర్వాయర్): 33 పోస్టులు
14) కెమిస్ట్: 39 పోస్టులు
15) జియాలజిస్ట్: 55 పోస్టులు
16) జియోఫిజిసిస్ట్(సర్ఫేస్ ): 54 పోస్టులు
17) జియోఫిజిసిస్ట్(వెల్స్): 24 పోస్టులు
18) ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 13 పోస్టులు
19) మెటీరియల్స్ మేనేజ్ మెంట్ ఆఫీసర్: 32 పోస్టులు
20) ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్: 13 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్ , డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ -2022 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 31.07.2022 నాటికి ఏఈఈ- డ్రిల్లింగ్/ సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు; మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.60,000 - రూ.180,000.
ఎంపిక ప్రక్రియ: గేట్-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.10.2022.
ఇవి కూడా చదవండి..
SSC CGL Notification 2022: 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..