NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. సెలక్ట్ అయితే భారీగా జీతం
నవోదయ విద్యాలయ సమితి( ఎన్వీఎస్) లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కింద పనిచేసే అటానమస్ సంస్థ.
నవోదయ విద్యాలయ సమితికి ఎనిమితి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే, షిల్లాంగ్‌లలో కార్యాలయాలు ఉన్నాయి. నవోదయ విద్యాలయ సమితి (NVS) షిల్లాంగ్ రీజియన్ మేఘాలయ, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచర్స్ మరియు ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్వీఎస్ రిక్రూట్‌మెంట్ 2021 పది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోయిడా, లక్నో - ఉత్తరప్రదేశ్, భోపాల్ - మధ్యప్రదేశ్, చండీగఢ్, హైదరాబాద్ - తెలంగాణ, జైపూర్ - రాజస్థాన్, పాట్నా - బీహార్, పూణే - మహారాష్ట్ర, షిల్లాంగ్ - మేఘాలయలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30-డిసెంబర్-2021గా ఉంది.
వయో పరిమితి: నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి గరిష్ట వయస్సు 30-12-2021 నాటికి 55 సంవత్సరాల లోపు ఉండాలి ఇంటర్వ్యూ/ పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను 30-11-2021 నుంచి ప్రారంభించారు. చివరి తేదీ 30-డిసెంబర్-2021 వరకు ఉంది.
పోస్ట్ పేరు పోస్ట్‌ల సంఖ్య
జనరల్ మేనేజర్ ( కన్ స్ట్రక్షన్ ) 1
డిప్యూటీ కమిషనర్ (ఫైనాన్స్) 1
అకౌంట్ ఆఫీసర్ 8
విద్యార్హతలు:
ఎన్వీఎస్ రిక్రూట్ మెంట్.. నోటిఫికేష్ ప్రకారం.. సివిల్ ఇంజినీరింగ్ లో బీఈ/బీటెక్ ను గుర్తింపు పొంది యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి.
జీతం వివరాలు:
జనరల్ మేనేజర్ (కన్ స్ట్రక్షన్) Rs. 1,23,100 నుంచి 2,15,900 వరకు
డిప్యూటీ కమిషనర్(ఫైనాన్స్) Rs. 78,800 నుంచి 2,09,200 వరకు
అకౌంట్ ఆఫీసర్ Rs. 44,900 నుంచి 1,42,400 వరకు
navodaya.gov.in వైబ్ సైట్ ను సందర్శించండి. అప్లై చేసేందుకు.. మీకు అర్హత ఉంటే, ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తు రుసుం (వర్తిస్తే) చెల్లించి, చివరి తేదీ (30-డిసెంబర్-2021)లోపు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి. దరఖాస్తు ఫారమ్ నంబర్/రసీదు సంఖ్యను దాచి పెట్టండి. భవిష్యత్ లో ఉపయోగపడొచ్చు.
Also Read: BEL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగ అవకాశాలు.. అప్లై చేసుకోండిలా..
Also Read: CTET Exam 2021: సీటెట్ హాల్‌టికెట్ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా