అన్వేషించండి

NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం

NTPC Jobs: నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NTPC Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.55,000 జీతంతోపాటు ఇతర భత్యాలు చెల్లిస్తారు.

వివరాలు..

* అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్‌) 

ఖాళీల సంఖ్య: 400 

పోస్టుల కేటాయింపు: యూఆర్‌-172; ఈడబ్ల్యూఎస్‌-40; ఓబీసీ-82; ఎస్సీ-66; ఎస్టీ- 40.

కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూషన్ నుంచి 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.55,000.

దరఖాస్తు చేయడం ఎలా..

➥ అభ్యర్థులు NTPC EET-2024 కోసం careers.ntpc.co.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి లేదా www.ntpc.co.inలోని కెరీర్స్ విభాగాన్ని సందర్శించి వారి వివరాలు నమోదు చేసుకోవాలి. 

➥ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 

➥ సూచనలను జాగ్రత్తగా చదవిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. పిదప సిస్టమ్ ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ నంబరు ఇస్తుంది. తదనంతరం అభ్యర్థులు అప్లికేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ దరఖాస్తు చేసుకొన్న తర్వాత సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడిన అప్లికేషన్ స్లిప్ యొక్క ప్రింట్ అవుట్‌ను జాగ్రత్త చేసుకోవాలి.

➥ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ సరిగ్గా పూరించబడిందని నిర్ధారించుకోవాలి. దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత అభ్యర్థి నమోదు చేసిన వివరాలలో ఏదైనా మార్చాలంటే దానికి సంబంధించి ఎటువంటి అభ్యర్థనను స్వీకరించబడదు.

➥ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలి.

అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్..

➥ ఫోటో

➥ 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా మార్క్‌షీట్(పేరు/పుట్టిన తేదీ ధృవీకరణకు)

➥ పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్.

➥ కాస్ట్/డిజబిలిటి సర్టిఫికేట్(ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు) వర్తిస్తుంది.

➥ ఓబీసీ-ఎన్‌సీఎల్‌ సర్టిఫికెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY 2024-25) సెంట్రల్ ఫార్మాట్‌లో ఉండాలి.

➥ ఈ ప్రకటనలో పేర్కొన్న పోస్ట్‌ల కోసం గుర్తించబడిన వైకల్యానికి అనుగుణంగా స్వవలంబన్/యుడిఐడి పోర్టల్ (డిజబిలిటి టైప్ & పర్సెంటేజ్) ద్వారా ఆన్‌లైన్‌లో రూపొందించబడిన తాజా నిర్దేశిత కేంద్ర ప్రభుత్వ ఫార్మాట్ ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రాలు ఉండాలి.

➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రస్తుత సంవత్సరం ఆదాయ & ఆస్తి సర్టిఫికేట్‌ను నిర్దేశించిన ఫార్మాట్‌లో సమర్పించాలి. అంటే ఈ సర్టిఫికేట్ 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయం ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లుబాటులో ఉండాలి.

➥ బీఈ/బీటెక్‌ డిగ్రీ సర్టిఫికేట్(ఎలక్ట్రికల్, మెకానికల్).

➥ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం లేదా కన్సాలిడేటెడ్ మార్క్‌షీట్/ట్రాన్స్‌క్రిప్ట్ స్పష్టంగా మొత్తం ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అన్ని సెమిస్టర్‌లలో మొత్తం పర్సంటేజ్ మార్కుల సరాసరి.

➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్, కాలక్రమానుసారం మరియు అనుభవ వ్యవధి, నియామక పత్రం, ఆఫర్ లెటర్, శిక్షణ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ లెటర్/ఆర్డర్, ప్రమోషన్ ఆర్డర్, రోల్ అసైన్‌మెంట్ ఆర్డర్, ట్రాన్స్‌ఫర్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్, రిలీవింగ్ లెటర్ మరియు అభ్యర్థి పదవీకాలం, అనుభవ స్వభావాన్ని ధృవీకరించడానికి 2 పే స్లిప్‌లు వంటి ఇతర పత్రాలు.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2025.

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Embed widget